తెలుగు లెసన్లు మొదలెట్టేసిందటగా..

Update: 2016-06-16 03:55 GMT
ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో అనుష్క - సమంత - తమన్నా - రకుల్‌ - రెజీనా వంటి భామలు కాస్త ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకంటే.. ఏళ్ళ తరబడి తెలుగులో దున్నేసుకున్నా కూడా త్రిష - నయన - కాజల్‌ వంటి భామలు ఒక్క మాట కూడా తెలుగు మాట్లాడరేమో గాని.. ఆ పైన చెప్పిన స్టార్‌ హీరోయిన్లు మాత్రం గలగలా అమృతంలా తెలుగును కురిపిస్తారు. అదే రూటు ఫాలో అవ్వనుంది మహేష్‌ బాబు కొత్త హీరోయిన్‌ కూడా.

ఇంకా అధికారికం కాకపోయినప్పటికీ.. ఏ.ఆర్.మురుగుదాస్‌ తీయబోయే సినిమాలో మహేష్‌ సరసన నటించే హీరోయిన్ కొత్తగా సన్నబడిన పరిణీతి చోప్రాయే అంటూ తెగ కన్ఫర్మేషన్లు వచ్చేస్తున్నాయి. తాజా అప్డేట్‌ ఏంటంటే.. తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవాలని పరిణీతి తపిస్తోందట. అందుకే ఆల్రెడీ తెలుగు లెసన్లు కూడా చెప్పించుకుంటోందట. ముఖ్యంగా తనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పినా కూడా.. లిప్ సింక్ అనేది మిస్ అవ్వకూడదు కాబట్టి.. ఉచ్ఛారణ మీద గ్రిప్ సంపాదించే పనిలో పడిందట పరిణీతి. వావ్.. వాటే థింకింగ్ కదూ!!

అయితే 3.5 కోట్లు ఇచ్చి ఈ సినిమాలో పరిణీతిని హీరోయిన్‌ తీసుకోవడం అంటే.. అది చాలా పెద్ద రిస్కీ యవ్వారం.. అనవసరమైన ఖర్చు.. అనేవారూ లేకపోలేదు. కాని సినిమా వస్తేనే కాని అసలు విషయం ఏంటనేది ఎవ్వరూ చెప్పలేం.
Tags:    

Similar News