పరిణీతి చోప్రా బొద్దు నుంచి ముద్దుగుమ్మగా మారిపోయిన ఈ బాలీవుడ్ సుందరి క్రేజ్.. ఇప్పుడు అమాంతం పెరిగిపోతోంది. నమ్మలేనంత స్థాయిలో తన ఫిజిక్ ని మార్చేసుకున్న ఈ బ్యూటీ.. బడా మేగజైన్ ల కవర్ పేజ్ లన్నీ కవర్ చేసేస్తోంది. ఫెమినా మేగజైన్ అంటేనే.. ఫ్యాషన్ కి - ట్రెండ్ కి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడీ మేగజైన్ ఏప్రిల్ ఎడిషన్ లో .. పరిణీతి సొగసులు చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలడం లేదు.
ముఖ్యంగా కవర్ పేజ్ పై వేసిన మల్టీ కలర్ కాస్ట్యూమ్ లో అయితే.. గుర్తు పట్టలేనంత స్లిమ్ గా మారిపోయింది పరిణీతి చోప్రా. నా టార్గెట్ ఏంటో రెండు నెలల్లో చూపిస్తానంటూ సవాల్ చేసి మరీ.. స్లిమ్ లుక్ లోకి వచ్చేసింది ఈ భామ. ఇక మేగజైన్ లోపల ఉన్న ఫోటోల్లో అమ్మడి అందాలను చూసి తరించాల్సిందే తప్ప చెప్పుకోవడం కష్టం. మేకప్ నుంచి కాస్ట్యూమ్స్ - హెయిర్ స్టైల్స్ వరకూ ట్రెండ్ ను క్రియేట్ చేసేలా కనిపిస్తోంది పరిణీతి.
ప్రస్తుతం పరిణీతి చోప్రా యష్ రాజ్ బ్యానర్ పై ఓ మూవీకి సంతకం చేసింది. అయుష్మాన్ ఖురానాకు జంటగా తెరకెక్కనున్న రొమాంటిక్ మూవీ 'మేరీ ప్యారీ బిందు'ను అక్షయ్ రాయ్ రూపొందించనున్నాడు. ఓ ఔత్సాహిక సింగర్ గా ఈ మూవీలో కనిపించనుంది పరిణీతి. ఇక.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందే మూవీకి తను సైన్ చేయలేదని పరిణీతి చెబుతున్నా.. ఇంకా ఈ టాక్ నడుస్తూనే ఉంది.