బావకు మరదలు కితాబు

Update: 2019-01-31 01:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికన్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ, క్రిస్టియన్‌ మతాచారాల ప్రకారం జరిగింది. గత నెలలో జరిగిన వీరి వివాహ వేడుకలో ప్రతి తంతు కూడా చాలా ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా జూతా చుపాయి(పెళ్లి కొడుకు చెప్పులు మరదల్లు దాయడం) గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. హీరోయిన్‌ పరిణితి చోప్రా ముందు నుండే తాను బావగారి చెప్పులు దాచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తానంటూ చెబుతూ వచ్చింది.

పెళ్లి తర్వాత పరిణితి చోప్రాకు నిక్‌ జోనాస్‌ అయిదు లక్షలు ఇచ్చాడని, గోల్డ్‌ చైన్‌ ఇచ్చాడంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. జూతా చుపాయిలో నిక్‌ ఏం ఇచ్చాడనే విషయంపై తాజాగా ప్రియాంక చోప్రా సోదరి పరిణితి చోప్రా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరిణితి చోప్రా తన బావ నిక్‌ జోనస్‌ పై ప్రశంసలు కురిపించింది.

జూతా చుపాయి సమయంలో మా బావగారు వారి బందువులకు సైగ చేయడంతో వారు ఒక బాక్స్‌ ను తీసుకు వచ్చారు. అందులో డైమండ్‌ రింగ్స్‌ ఉన్నాయి. ఆ రింగ్స్‌ ను మాకు బహుమానంగా ఇచ్చిరు. బావ  అంత విలువైన బహుమానం ఇస్తాడని మేము ఊహించలేదు. ఆయన ఇచ్చిన గిఫ్ట్‌ కు మేము షాక్‌ అయ్యాము. మా బావ బెస్ట్‌, అక్క ప్రియాంకకు మంచి భర్త దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని పరిణితి చెప్పుకొచ్చింది. మొత్తానికి మరదలును బుట్టలో పడేసి నిక్‌ మంచి మార్కులు దక్కించుకున్నాడు.

Tags:    

Similar News