బ్రహ్మోత్సవం నిరుత్సాహపరిచిన తర్వాత.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఎలర్ట్ గా ఉంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మురుదదాస్ డైరెక్షన్ లో ద్విభాషా చిత్రానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినా.. హీరోయిన్ విషయంలో డైలమా కొనసాగింది. బాలీవుడ్ భామను తెస్తున్నారనే టాక్ వినిపించినా.. క్లారిటీ లేదు. మహేష్ సినిమా ప్రారంభించుకునే సమయంలో ఇలాంటి వార్తలు కామన్ అనుకున్నారంతా.
కానీ ఈసారి మాత్రం.. మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించడం ఫిక్స్ అయిపోయింది. మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో ప్రారంభం కానున్న మూవీలో పరిణీతి చోప్రాను హీరోయిన్ గా ఫైనల్ చేసేశారు. రాజకుమారుడి సరసన టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నా.. పారితోషికం విషయంలో పరిణీతి ఏమాత్రం పట్టు విడవలేదు. మొదట తాను చెప్పిన 3.5 కోట్ల రూపాయల మాట పైనా గట్టిగా నిలబడింది. దీంతో గత్యంతరం లేక ఆ మూడున్నర కోట్లు ముట్టచెప్పేసి.. ఆమె దగ్గర నుంచి రెండు నెలల డేట్స్ తెచ్చుకున్నారట మురుగ అండ్ టీం.
ఇంత భారీగా పరిణీతికి ముట్టచెప్పడానికి కారణం.. ఈ చిత్రాన్ని హిందీ డబ్బింగ్ వెర్షన్ గా రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవడానికే అనే టాక్ ఉంది. అప్పట్లో కత్రినాకైఫ్ కు ఏ మాత్రం క్రేజ్ లేని సమయంలో కోటికి పైగా ముట్టచెప్పి మల్లీశ్వరిలో నటింపచేశారు. అయితే.. ఆమె ఇక్కడ క్లిక్ కాలేదు సరికదా.. కేట్ చేయడంతో సినిమాకి ఏమి పాజిటివ్స్ యాడ్ అవలేదు. మరిప్పుడు పరిణీతి విషయంలో ఏం జరగనుందో?