తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజ రచయితలైన పరుచూరి బ్రదర్స్ ఎన్నో రాజకీయ చిత్రాలకు రచన సహకారం అందించిన విషయం తెల్సిందే. అలాంటి పరుచూరి బ్రదర్ గోపాల కృష్ణ పరుచూరి పలుకులు అంటూ సోషల్ మీడియాలో ఈమద్య తెగ సందడి చేస్తున్నారు. ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలపై విభిన్నంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ను ఒకవైపు పొగడ్తలతో ముంచెత్తుతూనే మరో వైపు రాజకీయ పాఠం చెప్పాడు. పవన్ కళ్యాణ్ కు దేవుడు అద్బుతమైన సినీ కెరీర్ ను ప్రసాదించినా, ఆయన చాలా కష్టమైన రాజకీయ రంగంను ఎంచుకున్నాడని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు.
పవన్ కళ్యాణ్ గురించి పరుచూరి బ్రదర్ గోపాల కృష్ణ మాట్లాడుతూ... ఈమద్య కాలంలో నేను పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో బాదేస్తోంది, భయం వేస్తోంది, విసుగేస్తోంది అన్న పదాలు వాడారు. ఆ మూడు పదాల గురించి నేను ఆయన అభిమానులకు వివరించాలనుకుంటున్నాను. ఎదుటి వాడు ఎక్కడ నష్టపోతాడో అని బాధపడే లక్షణం కామ్రేడ్ లో ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ లో కనిపిస్తోంది. ఇక భయం అనేది చాలా గొప్ప పదం. ఎంతో గొప్ప నాయకుడికి మాత్రమే ఆ ఆలోచన రాదు. తనకు ఏమైనా అయితే ఈ జనం ఏమైపోతారో అనే భయం పవన్ కళ్యాణ్ లో కనిపిస్తోంది.
ఇక రాజకీయ నాయకుల్లో అస్సలు కనిపించకూడనిది, రాజకీయ నాయకుల నుండి వినిపించకూడనిది విసుగు. రాక్షస రాజకీయ లక్షణం ఏంటీ అంటే అవతలి వారిని విసుగు తెప్పించి, వారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అలాంటి ప్రయత్నాలు చాలా మంది చేస్తారు. రాజకీయాల్లో ఆ పదం మాత్రం వాడొద్దు. రాజకీయ నాయకుడికి బాధ, భయం ఉండాలి కాని, విసుగు ఉండవద్దు అనేది పరుచూరి వారి పలుకు అర్థం. ఈ విషయం పవన్ కు రాజకీయ పాఠం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఎప్పుడు కూడా విసుగుకోకూడదని కొందరు సలహా ఇస్తున్నారు.