'గాడ్ ఫాద‌ర్' కు అవే ప్ర‌ధాన మైన‌స్ అయ్యాయ‌ట‌!

Update: 2022-11-26 14:30 GMT
ర‌చ‌యిత‌గా ఎన్నో వంద‌ల చిత్రాల‌కు క‌థ, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ లకు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ప్ర‌ముఖ రైట‌ర్స్ పరుచూరి బ్ర‌ద‌ర్స్‌. ఈ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ లో ఒక‌రైన ప‌రుచూరి గోపాల‌కృష్ణ ప‌లు సినిమాల‌పై త‌ప‌న‌దైన వ్యూని వ్య‌క్తం చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఫ్లాప్ అయితే ఎందుకు ఏ అంశాల లోపం కార‌ణంగా ఫ్లాప్ అయిందో.. హిట్ .. బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే ఏ అంశాలు ప్ర‌ధాన పాత్ర పోషించ‌డం వ‌ల్ల అయిందో విశ్లేష‌ణాత్మ‌కంగా వివ‌రిస్తున్నారు.

తాజాగా మెగాస్టార్ న‌టించిన 'గాడ్ ఫాద‌ర్‌' పై కూడా సంచ‌ల‌నాత్మ‌కంగా త‌న‌దైన విశ్లేష‌ణ‌తో ఈ మూవీ ఎందుకు ఆక‌ట్టుకోలేక‌పోయిందో..ఏ ఏ అంశాలు ఈ మూవీకి ప్ర‌ధాన మైన‌స్ గా మారాయో వెల్ల‌డించారు. మ‌ల‌యాళ మాతృక 'లూసీఫ‌ర్' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేసినా తెలుగు ప్రేక్ష‌కులకు అనుగుణంగా మార్పులు చేయ‌డం బాగుంది కానీ ఇలాంటి స్లో పేస్ సినిమాలు చిరుకు వ‌ర్క‌వుట్ కావ‌న్నారు. ఆయ‌న బాడీ లాంగ్వేజ్ కు ఇలాంటివి సెట్ కావ‌న్నారు.

తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరు వ‌య్యేలా చిన్న చిన్న మార్పులు చేసిన లూసీఫ‌ర్ క‌థ‌నే తెర‌పైకి తీసుకొచ్చారు. క‌థ‌లో తెలుగు ద‌నం క‌నిపించ‌డం కోసం టీమ్ చ‌ర్య‌లు తీసుకున్నారు. అందుకే ఈ సినిమా విజ‌య‌వంత‌మైంది. ఇదొక క‌ర్ణుడి క‌థ‌. త‌న చెల్లెళ్ల‌కు దూరంగా వుండే ఓ అన్న‌య్య వారిని ఎలా కాపాడాడు?.. వాళ్ల ప్రేమ‌ను ఎలా పొంద‌గ‌లిగాడ‌న్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థాంశం. మాతృక‌లో న‌య‌న‌తార పాత్ర‌మే వుంది. త‌న పాత్ర‌కు చెల్లెలు లేదు. అయితే ఇందులో మాత్రం చెల్లెలు పాత్ర‌ని యాడ్ చేశారు.

ద‌ర్శ‌కుడు స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడు. స‌మ‌యానుగుణంగా ట్విస్ట్ ల‌ను రివీల్ చేస్తూ క‌థ‌లోకి తీసుకెళ్లాడు. మాతృక‌తో పోలిస్తే తెలుగులో మంచి స్క్రీన్ ప్లే వుంది. క‌థ‌లో ప‌రోక్షంగా తెలుగు రాజ‌కీయాల‌ను చూపించారు.  క‌థ‌, క‌థ‌నం, డైలాగ్స్ ని బ‌ట్టి కాకుండా చిరు బాడీ లాంగ్వేజ్ ని బ‌ట్టి కొన్ని విష‌యాల్లో మార్పులు చేస్తే బాగుండేదన్నారు. స్లోగా సాగే క‌థ‌.. చిరు బాడీ లాంగ్వేజ్ కు స్లో న‌రేష‌న్ న‌ప్ప‌లేదు.

ఇది చిరుకు సెట్ట‌య్యే క‌థ కాదు.. కానీ ద‌ర్శ‌కుడు చాలా వ‌ర‌కు ఈ క‌థ‌ని తెర‌కెక్కించ‌డంతో విజ‌య‌వంత‌మ‌య్యాడు. అంతే కాకుండా చిరు పాత్ర‌కు డ్యాన్సులు లేక‌పోవ‌డం ఇబ్బందిక‌రంగా అనిపించింది. స‌ల్మాన్ ఈ సినిమాకు ప్ల‌స్ .. మైన‌స్ కూడా.

చిరుకు బాడీ గార్డ్ గా స‌ల్మాన్ అదర‌గొట్టాడు. అయితే ఫ్రేమ్ లో చిరు వుండ‌గా స‌ల్మాన్ ఖాన్ ఫైట్స్ చేయ‌డం అభిమానుల‌కు న‌చ్చ‌లేదు. ఆ పాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్, రామ్ చ‌ర‌ణ్ వుండి వుంటే తేడా అనిపించేది కాదు. మ‌రిన్ని డైలాగ్స్ వుంటే బాగుండేద‌ని 'గాడ్‌పాద‌ర్'పై తన అభిప్రాయాన్ని వెల్ల‌డించారు ప‌రుచూరి గోపాల‌కృష్ణ.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News