టాలీవుడ్ స్టార్ రైటర్ పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పలుకులు అంటూ రిలీజైన ప్రతి సినిమా గురించి ఆయన మార్క్ విశ్లేషణ ఇస్తూ ఉంటారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే కాకపోయినా ఆయన సినిమా చూసినప్పుడు నచ్చితే మాత్రం సినిమా గురించి స్పెషల్ గా ప్రస్తావిస్తారు. లేటెస్ట్ గా పరుచూరి పలుకులు ద్వారా యశోద సినిమా గురించి తన వ్యూ చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ.
యశోద సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. తమిళ దర్శకులు హరీష్ హరి కలిసి ఈ మూవీ ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా చూసిన పరుచూరి గోపాలకృష్ణ సినిమా అద్భుతంగా ఉందని అన్నారు.
సినిమాలో సమంత నటన చాలా బాగుందని అన్నారు. ఇలాంటి సినిమాలు చేయాలంటే గట్స్ ఉండాలని అన్నారు. ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అని.. మొదట్లోనే అది తెలిసేలా సీన్స్ రాసుకున్నారని అన్నారు. ఫస్ట్ లో అమాయకంగా కనిపించిన హీరోయిన్ క్లైమాక్స్ లో తన విశ్వరూపం చూపించడం బాగుందని అన్నారు.
విజయశాంతి కర్తవ్యం తీసిన టైం లో ఈ యశోద కథ తీస్తే ఇంకా చాలా బాగుండేదని అన్నారు. ఇలాంటి పాత్రల్లో విజయశాంతి అలవోకగా చేసేవారు. అందుకే ఈ కథకు విజయశాంతి అయితే బాగుంటుందని అనిపించింది. అందం కోసం చిన్నపిల్లల ప్లాస్మా ఉపయోగించడం లాంటి కథ ఎవరు విన్నా చలించిపోతారని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. యశోద సినిమా చివరి 40 నిమిషాలు భయం వేస్తుందని.. ఇది ఒక గొప్ప ప్రయోగమని చిత్రయూనిట్ ని ప్రశంసించారు పరుచూరి గోపాలకృష్ణ. సినిమాలో పాత్రల పేర్లు కూడా యశోద, గౌతం, బలరాం, వాసుదేవ్ ఇలా భాగవత కథ గుర్తు చేసేలా పెట్టారని అన్నారు.
యశోద ఒక మంచి సినిమా.. అందరు చూడాల్సిన సినిమా అని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. కొత్తగా సినిమాలు తీయాలని అనుకునే వారికి ఇలాంటి సినిమాలు చూస్తే చాలా విషయాలు అర్ధమవుతాయని అన్నారు. యశోద సినిమా చూసినప్పుడు ఇలాంటి కొత్త కథలు రాయొచ్చని.. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు ఎలా తీయొచ్చో నేర్చుకోవచ్చని అన్నారు. నా కోసం ఈ సినిమా చూడండి అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సమంత యశోద సీనియర్ స్టార్ రైటర్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.