స్టాప్ నుంచి క్లాప్ వరకూ.. పరుచూరి కథ

Update: 2016-04-29 12:32 GMT
విజయ్ హీరోగా తమిళనాట బ్లాక్ బస్టర్ సాధించిన కత్తి మూవీని.. మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమాగా సెలక్ట్ చేసుకుని.. ఇప్పుడు పూజా కార్యక్రమాలు కూడా ఫినిష్ చేసేశారు. ఈ సినిమాకి తొలి క్లాప్ కొట్టిన వ్యక్తి పరుచూరి వెంకటేశ్వరరావు. ఇక్కడే అసలు కథ ఒకటి ఉంది. అసలు ఈ కత్తి చిత్రాన్ని రీమేక్ చేయాలని మెగాస్టార్ నిర్ణయించుకున్నారనే వార్తలు రాగానే.. ఓ రైటర్ ఈ కత్తి కథ తనదే అని, మురుగదాస్ తన స్టోరీని కాపీ కొట్టేసి సినిమా తీసేశాడని చెప్పుకొచ్చాడు.

కొన్నేళ్ల క్రితమే ఈ కథని రిజిస్టర్ చేయించిన విషయాన్ని కూడా చెప్పాడు. అటు తమిళ కత్తిని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ను, హీరో విజయ్ ను కూడా కలిసి తను మోసపోయిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. అక్కడి నుంచి రియాక్షన్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. తెలుగు రైటర్స్ అసోసియేషన్ లో కంప్లెయింట్ చేశాడు. మనోళ్లు మాత్రం బాగానే స్పందించారు. ఇష్యూ సెటిల్ అయ్యే వరకూ కత్తి చిత్రానికి ఎవరూ సహకరించకూడదంటూ మీడియా సాక్షిగా ఓ హుకుం కూడా జారీ చేశారు. ఆ ప్రెస్ మీట్ కి అధ్యక్షత వహించినది.. ఇప్పుడు క్లాప్ కొట్టిన పరుచూరి వెంకటేశ్వరరావే అని గుర్తు చేసుకోవాలి.

ఇదంతా జరగడానికి మధ్య కొన్ని నెలల సమయం ఉండడంతో.. మధ్యలో సమస్యను పరిష్కరించుకుని ఉంటారని అనుకోవచ్చుకానీ.. అప్పుడు అడ్డుపడ్డ పరుచూరితోటే.. ఇప్పుడు తొలిషాట్ కు క్లాప్ కొట్టించడం అంటే.. అదంతా అల్లు అరవింద్ తిప్పిన చక్రం మహిమే అంటున్నారు సినీ జనాలు.
Tags:    

Similar News