ప‌ద‌వి తెచ్చిన తంటా! ప‌రుచూరికి బిగ్ హెడేక్!!

Update: 2019-07-03 17:30 GMT
ప‌ద‌వి గుదిబండ లాంటిది అంటారు!!  తేడా కొడితే బొప్పి క‌ట్టిస్తుంద‌ని అనుభ‌వంతో చెబుతుంటారు. ప్ర‌స్తుతం అదే ప‌దవి చిత్ర‌పురి కాల‌నీకి అధ్యక్షుడిగా ఉన్న ప‌రుచూరి సోద‌రుడు వెంక‌టేశ్వ‌ర‌రావుకు పెద్ద హెడేక్ గా మార‌డం కాల‌నీలో చ‌ర్చ‌కొచ్చింది. గ‌త అధ్య‌క్షుడు కొమ‌ర వెంక‌టేష్ ని ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌ల‌తో అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి దించేసి ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు ని అధ్య‌క్షుడిగా ఎంపిక చేశారు. ఏడాది పాటు ఆయ‌న ప‌ద‌వీ కాలం ఉండ‌నుంది. 2020లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండ‌గా ఈలోగానే చిత్ర‌పురికి సంబంధించిన ప‌లు వివాదాలు ముప్పిరి గొల‌ప‌నివ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఇన్నేళ్ల‌యినా డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను పూర్తి చేసి కార్మికుల‌కు అప్ప‌గించ‌లేద‌న్న ఒత్తిడి ఎక్కువైంది. అలాగే ఇక్క‌డ మిగిలి ఉన్న ఖాళీ స్థ‌లాన్ని వ్యాపారం చేయ‌కుండా ఇల్లు క‌ట్టి మాకే ఇవ్వాల‌ని సినీ-టీవీ కార్మికుల్లో ఇల్లు లేని వారంతా పోరు బాట ప‌ట్ట‌డం వేడెక్కిస్తోంది.

ఈ సందర్భంగా సినీ కార్మికుల ప్రతినిధి కస్తూరి శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ఫిలింఛాంబ‌ర్ నుంచి చిత్ర‌పురి క‌మిటీ ఆఫీస్ వ‌రకూ నేటి ఉద‌యం ర్యాలీ జ‌రిగింది. ఈ ర్యాలీలో క‌స్తూరి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ-`` తెలుగు సినీ కార్మికుల కోసం ఎందరో సినీ మహానుభావుల త్యాగాల ఫ‌లితం చిత్ర‌పురి కాల‌నీ. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1994 లో మణికొండ ఏరియాలో 67 ఎకరాల 17 కుంటల స్థ‌లాన్ని సినీ కార్మికుల కోసం కేటాయించింది. కానీ కొంతమంది స్వార్థపరులు పాలకమండలి గా ఏర్పడి 67 ఎకరాల్లో 70 శాతం బయటవాళ్ళకి అమ్మేశార‌ని అందులో బ‌డా బాబులు ఉన్నార‌ని తీవ్రంగా ఆరోపించారు.

చిత్ర‌పురి ప‌రిస‌రాల్లో ఇప్పుడున్న నాలుగు ఎకరాల ఖాళీ స్థలంలో 2200 ఎస్.ఎఫ్.టీ తో 18 ఫోర్లు కట్టి ఒక్కో ఇంటికి 55 లక్షలుకు మళ్ళీ బయటవాళ్లకు అమ్మేందుకు మరో పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయబోతున్నారని క‌స్తూరి ఆరోపించారు. నిజమైన కార్మికుల కోసం సింగిల్ బెడ్రూం లు మాత్రమే కట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఫిలిం ఫెడరేషన్ - సినీ కార్మికులంతా ఏకమై చిత్రపురి సొసైటీ పాలకమండలి  అక్ర‌మాల‌పై పోరాడితే మనకు చెందాల్సిన ఇండ్లు సాధించుకోవ‌చ్చ‌ని కార్మికుల నుద్ధేశించి ప్ర‌సంగించారు. అయితే చిత్రపురిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థ‌లంలో ఇంకా మిగిలి ఉన్న కార్మికుల‌కు ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న తెరాస అధినాయ‌కులు కేసీఆర్- కేటీఆర్ వ‌ద్ద‌కు వెళ్లింద‌ని చిత్ర‌పురి క‌మిటీ ఇదివ‌ర‌కూ వెల్ల‌డించింది. మ‌రి ఈ గొడ‌వ వెన‌క అస‌లు నిజానిజాలేంటో పూర్తిగా నిగ్గు తేలాల్సి ఉంది.


Tags:    

Similar News