పటేల్ సార్.. జగపతి అదరగొట్టేశాడు

Update: 2017-03-30 10:41 GMT
ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగాడు జగపతి బాబు. ‘గాయం’ లాంటి ఫెరోషియస్ గ్యాంగ్ స్టర్ సినిమాల్లోనే కాక ‘మావిచిగురు’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లలోనూ మెప్పించారాయన. ఐతే ఓ దశ దాటాక హీరోగా ఆయన కెరీర్ దెబ్బ తింది. ఒక టైంలో ఆయన సినిమాల్ని జనాలు పట్టించుకోవడం మానేశారు. ఇక రిటైరవ్వడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఆయన అనుకోకుండా ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారం ఎత్తారు. ఆ తర్వాత కథేంటన్నది అందరికీ తెలిసిందే. ఐతే విలన్.. క్యారెక్టర్ రోల్స్ లోకి మారాక హీరో వేషాలకు స్వస్తి చెప్పేసిన జగపతి.. ఎట్టకేలకు మళ్లీ ఒక లీడ్ రోల్ చేయడం విశేషం. ఆ సినిమానే.. పటేల్ సార్.

జగపతి తన వయసును దాచుకోకుండా మిడిలేజ్డ్ రోల్ లో కనిపిస్తున్న ‘పటేల్ సార్’ వయొలెంట్ యాక్షన్ స్టోరీ లాగా కనిపిస్తోంది. వారాహి చలనచిత్రం నిర్మించిన ఈ చిత్రం టీజర్ ఈ రోజు రాజమౌళి చేతుల మీదుగా రిలీజవడం విశేషం. ఈ సినిమా మొదలైన సంగతే చాలామందికి తెలియదు. ఇప్పుడు సినిమాను పూర్తి చేసి టీజర్ కూడా లాంచ్ చేసేశారు. ఆ టీజర్ చాలా స్టన్నింగ్ గా ఉంది. టీజర్లో జగపతి లుక్.. ఆయన స్టయిల్.. యాక్షన్ ఎపిసోడ్స్.. డైలాగులు చూస్తే వావ్ అనిపించకమానదు. ఒక చిన్న అమ్మాయిని కాపాడే మిడిలేజ్డ్ వ్యక్తిగా కనిపిస్తున్నాడు జగపతి. ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ భలే ఉంది. కండలు తిరిగిన బాడీతో జగపతి చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. వాసు పరిమి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయవుతున్నాడు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News