టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే సంగతి తెలిసిందే. ఫ్రెండ్ షిప్ కంటే అంతకుమించిన అనుబంధం వారి మధ్య ఉంటుందని అంటుంటారు. ఈ నేపథ్యంలో పవన్ కు అన్ని విషయాల్లోనూ తన సహాయసహకారాలు అందిస్తుంటారు త్రివిక్రమ్.
'వకీల్ సాబ్' మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పుడు డేట్లు ఇస్తారు.. ఎప్పుడు సినిమా కంప్లీట్ చేస్తారనేది తెలియనప్పటికీ.. అడ్వాన్సులు తీసుకుంటూ కొత్త ప్రాజెక్ట్స్ కు కమిట్ అవుతున్నారు.
అయితే రీఎంట్రీ తర్వాత పవన్ కోసం స్క్రిప్ట్‌లను ఫైనలైజ్ చేసే బాధ్యత త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారని.. దర్శకులను ఎంపిక చేయడం వంటి విషయాలను దగ్గరుండి చూసుకుంటున్నారనే టాక్ ఉంది. ప్రెజెంట్ పవన్ సైన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ త్రివిక్రమ్ సెట్ చేసినవేనని వినికిడి.సోషల్ మీడియాలో తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, దాదాపు పవన్ కళ్యాణ్ రాబోయే అన్ని చిత్రాలకు త్రివిక్రమ్ కూడా సహనిర్మాతగా ఉండబోతున్నాడట. ఈ మేరకు పవన్ తో సినిమాలు చేయబోయే నిర్మాణ సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నారట.
ఇంతకముందు హారిక అండ్ హాసిని మరియు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో షేర్ తీసుకున్న త్రివిక్రమ్.. ఇటీవలే ఫార్చ్యూన్ 4 సినిమాస్ అనే సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. రాధాకృష్ణ - సూర్యదేవర నాగవంశీ నిర్మించే దాదాపు అన్ని చిత్రాల్లో త్రివిక్రమ్ బ్యానర్ ను భాగస్వామ్యం చేస్తున్నారు.అయితే ఇప్పుడు పవన్ రాబోయే చిత్రాలలో చాలా వరకు తన బ్యానర్ ను భాగం చేయాలని దర్శకుడు భావిస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
ఇకపోతే 'భీమ్లా నాయక్' చిత్రానికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్.. ప్రస్తుతం పవన్ తదుపరి చిత్రం 'వినోదయ సీతమ్' తెలుగు రీమేక్ బాధ్యతలు కూడా తీసుకున్నారని టాక్. సముద్రఖని డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా కోసం ఆయన స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిస్తున్నారని టాక్.
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగున్నాయి. వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది.