పవన్.. హరీష్‌ కాంబో మరో ఇంట్రెస్టింగ్ పుకారు

Update: 2021-05-16 06:30 GMT
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్ సినిమా అధికారిక అనౌన్స్ వచ్చిన సమయంలోనే క్రిష్‌ దర్శకత్వంలో ఒక సినిమాను మరియు హరీష్‌ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే క్రిష్‌ మరియు హరీష్‌ శంకర్‌ ల సినిమాలు కూడా పట్టాలెక్కి షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల అయ్యేవి. కాని కరోనా కారణంగా మొత్తం తలకిందులు అయ్యింది. క్రిష్‌ దర్శకత్వం లో సినిమా పట్టాలెక్కింది కాని హరీష్‌ శంకర్ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. హరీష్‌ శంకర్‌ మూవీ కంటే ముందు అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ ను పవన్ మొదలు పెట్టాడు.

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌ పూర్తి అయిన హరీష్‌ శంకర్ మూవీ కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా మరింత ఆలస్యం అవుతోంది. పరిస్థితులు కుదుట పడితే జులై లేదా ఆగస్టులో సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు. ఇక హరీష్‌ శంకర్ మూవీ గురించి అనౌన్స్‌ వచ్చినప్పటి నుండి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమా లో పవన్‌ పాత్ర గురించి.. డబుల్‌ రోల్‌ అంటూ ఇంకా రకరకాలుగా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ పుకారు ఒకటి మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ అభిమానులకు సినిమాపై ఆసక్తి కలిగిస్తుంది.

సినిమా మొదటి షెడ్యూల్‌ లో భాగంగా ప్ల్యాష్‌ బ్యాక్‌ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. పవన్‌ కళ్యాణ్‌ తండ్రి కొడుకులుగా ఈ షెడ్యూల్‌ లోనే నటించబోతున్నాడు. మొదలు పెట్టడమే పవన్ కళ్యాణ్ పోలీస్‌ ఆఫీసర్ గా సన్నివేశాలను మరియు తండ్రి కొడుకుల మద్య సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం అందుతోంది. మొత్తానికి హరీష్‌ శంకర్‌ సినిమా మరో గబ్బర్‌ సింగ్‌ రేంజ్ సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఎంటర్‌ టైన్ మెంట్ తో పాటు ఒక మంచి దేశ భక్తి కాన్సెప్ట్‌ ఇంకా మెసేజ్‌ కూడా ఈ సినిమా లో ఉంటుందని యూనిట్‌ వర్గాల వారు చెబుతున్నారు.


Tags:    

Similar News