పవన్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కి ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సినిమా ఫ్లాప్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాడు. మరో వైపు త్రివిక్రమ్ కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ గా అజ్ఞాతవాసి మిగిలింది. నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. అన్ని విధాలుగా కూడా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది. అయితే త్రివిక్రమ్ సినిమాలు థియేటర్ లో ఆడినా - ఆడకున్నా కూడా బుల్లి తెరపై మాత్రం ఆడుతాయనే నమ్మకం ఉంది.
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చి నిరాశ పర్చిన ఖలేజా మరియు అతడు చిత్రాలు బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పటికి కూడా మెప్పిస్తూనే ఉన్నాయి. అదే నమ్మకంతో జెమిని టీవీ ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని ఏకంగా 19.5 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో కాస్త ఆలస్యంగా బుల్లి తెరపై ప్రదర్శించాలని జెమిని టీవీ కాస్త గ్యాప్ తీసుకుంది. తాజాగా దీపావళి కానుకగా అజ్ఞాతవాసిని టెలికాస్ట్ చేయడం జరిగింది.
జెమిని టీవీలో దీపావళి కానుకగా ప్రసారం అయిన ‘అజ్ఞాతవాసి’ మూవీకి కేవలం 5.3 టీఆర్పీ దక్కింది. మహేష్ బాబు ఫ్లాప్ మూవీ స్పైడర్ టీఆర్పీ రేటింగ్ కంటే అజ్ఞాతవాసి టీఆర్పీ రేటింగ్ మరీ తక్కువగా వచ్చింది. దాంతో జెమిని ఛానెల్ వారికి భారీ నష్టంగా చెప్పుకుంటున్నారు. ఒక స్టార్ హీరో మూవీ టీఆర్పీ రేటింగ్ మరీ 5.3 అవ్వడం చాలా అరుదు. 6.5 కు మించి స్టార్ హీరోల సినిమాలు టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంటాయి. అయితే పవన్ అభిమానులు మాత్రం అజ్ఞాతవాసిని రాంగ్ టైమింగ్ లో ప్రసారం చేశారని ఆరోపిస్తున్నారు. ఇతర ఛానెల్స్ లో పెద్ద సినిమాలు లేని సమయంలో ఈ చిత్రంను మరోసారి ప్రసారం చేయాలని అభిమానులు కోరుతున్నారు.