వకీల్ సాబ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ట్రెడ్డింగ్ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ అభిమానుల గొంతును బండ్ల గణేష్ వినిపించాడు అంటూ నెట్టింట పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. దిల్ రాజు అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ లో బండ్ల గణేష్ స్పీచ్ ను చూడవచ్చు. ఆ వీడియో అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్ ట్రెండ్డింగ్ లో నెం.1 గా నిలిచింది. సోమవారం మద్యాహ్నం వరకు నెం.1 గా బండ్ల గణేష్ స్పీచ్ ఉంటే.. నెం.2 గా పవన్ కళ్యాన్ స్పీచ్ ఉంది. పవన్ కళ్యాణ్ మరియు బండ్ల గణేష్ ల స్పీచ్ లు నువ్వా నేనా అన్నట్లుగా టాప్ లో ట్రెండ్ అవుతూ వ్యూస్ పరంగా కూడా పోటీ పడ్డాయి. పవన్ కళ్యాణ్ స్పీచ్ రెండు మిలియన్ లను క్రాస్ చేసి నెం.1 స్థానంకు చేరగా బండ్ల గణేష్ స్పీచ్ నెం.2 స్థానంకు చేరిపోయింది.
పవన్ కళ్యాణ్ స్పీచ్ దాదాపు 36 నిమిషాలు ఉండగా బండ్ల గణేష్ స్పీచ్ ఆరు నిమిషాల పాటు కొనసాగింది. వీరిద్దరి వీడియోలు దాదాపు 36 గంటలుగా యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. బండ్ల గణేష్ స్పీచ్ ను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ స్పీచ్ అరగంటకు పైగా ఉన్నా కూడా అభిమానులు ఆసక్తిగా యూట్యూబ్ లో చూస్తూ టాప్ లో నిలిపారు. మొత్తానికి దేవుడితో పాటు భక్తుడు కూడా ట్రెండ్డింగ్ అవుతున్నాడు అంటూ పవన్ అభిమానులు బండ్ల గణేష్ ను ఉద్దేశించి అంటున్నారు.
బండ్ల గణేష్ మాటలను బట్టి ఆయన ఎంతటి పవన్ భక్తుడో అర్థం చేసుకోవచ్చు. ఒక అభిమాన నటుడిగా కాకుండా దేవుడిగా మాత్రమే పవన్ ను బండ్ల గణేష్ చూస్తాడు అనేది ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు అద్బుతమైన వాక్చాతుర్యం కలిగి ఉన్న బండ్ల గణేష్ స్పీచ్ ను ప్రతి సారి పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా కూడా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఉంటే పవన్ నవ్వడం మనం చూడవచ్చు. ఇక వకీల్ సాబ్ విషయానికి వస్తే ఈనెల 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.