మళ్లీ పవర్ స్టార్-త్రివిక్రమ్ కాంబో

Update: 2018-06-22 17:41 GMT
పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే.. అబ్బో పిచ్చ క్రేజ్. కానీ ఇది కొన్ని నెలల క్రితం వరకూ మాత్రమే. గతంలో జల్సా.. అత్తారింటికి దారేది అంటూ.. అభిమానులను మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు అందరినీ ఉర్రూతలు ఊగించే సినిమా అందించిన కాంబినేషన్ అది.

అలాంటి కాంబోపై ఇప్పుడు అభిమానులు కూడా భయపడే పరిస్థితి. ఇందుకు కారణం.. పక్కాగా అజ్ఞాతవాసి మూవీ.. అది అందించిన రిజల్ట్ మాత్రమే. అయితే.. దీని నుంచి బైటకు వచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రం చేస్తున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఎజెండాపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు పవన్ తో కలిసి మాటల మాంత్రికుడి సినిమా మరొకటి ఉంటుందని.. అజ్ఞాతవాసి బాకీని తీర్చేసుకోవాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యాడనే టాక్ హాట్ టాపిక్ అయింది. నిజానికి పవన్ కోసం ఎప్పుడో ఓ కథ రాసుకుని పెట్టుకున్నాడు త్రివిక్రమ్.

కోబలి అనే టైటిల్ పై పవర్ స్టార్ తో మూవీ ఉంటుందని కూడా చెప్పాడు. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ట్రెండ్ ప్రకారం వెళ్లి అజ్ఞాతవాసి తీశారంతే. కానీ త్రివిక్రమ్ మాత్రం కోబలిపై పట్టుదలగానే ఉన్నాడట. 2019లో ఎన్నికల హంగామా అంతా పూర్తయిపోయిన తర్వాత 2020లో ఈ కోబలి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. రాధాకృష్ణ నిర్మాతగానే ఈ చిత్రం ఉంటుందని.. కేవలం రెండు నెలల సమయంలోనే పవన్ కు సంబంధించిన ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తారని.. మూవీలో అసలు పాటల ప్రస్తావనే ఉండదని.. రెండు గంటల కంటే తక్కువ నిడివితో ఉండే ఈ సినిమా.. 2020లో పట్టాలెక్కడం ఖాయమని టాలీవుడ్ టాక్.
Tags:    

Similar News