హీరోల్లోనే ఓ సపరేట్ పీస్ పవన్ కల్యాణ్ అంటూ కీర్తించాడు ఓ అగ్రనిర్మాత. ఆయన ఏం చేసినా సంథింగ్ స్పెషల్. అందరిలాగా పబ్లిసిటీ కోరుకోడు. ముభావంగా ఉంటాడు. ఏ పబ్లిక్ ఫంక్షన్ కి వెళ్లడు. తను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడు. అందుకే అతడిని అలా వర్ణించాడు అతడు. అందుకు తగ్గట్టే మొన్నటిరోజున అన్నయ్య చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటాడా? లేదా? అన్న సందేహాలొచ్చాయి అందరికీ.
తమ్ముడిపై ఈ విషయంలో నాగబాబు ఫైరయ్యాడన్న వార్తలూ వచ్చాయి. అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ తమ్ముడు అన్నయ్య కోసం దిగి వచ్చాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ షూట్ నుంచి పరిగెత్తుకొచ్చాడు. తనకి అన్నపై ఉన్న ప్రేమ అన్నిటికీ అతీతమైనది అని నిరూపించాడు. సోదర ప్రేమను చూపించాడు. అన్నయ్య వదినల్ని కలిసి షష్టిపూర్తి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఇదిగో ఈ ఫోటోలో అన్నయ్య, వదిన, చరణ్ లతో పాటే ఒకే ఫ్రేములోకి వచ్చి నవ్వులు చిందిస్తున్నాడు. అయితే ఆ నవ్వులో ఏదో అంతరార్థం కనిపిస్తోంది. ముభావంగా లేడు కానీ, నాపైనే ఇంత రచ్చ చేశారెందుకు? నేనేమైనా కానివాడినా? అన్నయ్యపై ప్రేమను మీరు గుర్తు చేయాలా? నేను ఈ స్థాయికి ఎదిగానంటే నా వెనుక ఉన్నది ఎవరు? పిచ్చి సన్నాసులు.. అంటూ లోలోన నవ్వుకుంటునట్టు అనిపిస్తోంది. అందుకే ఆ నవ్వులో బుంగమూతి బిగించినట్టు ఉంది. సరిగ్గా నవ్వవయ్యా పవనూ.. ఎక్కడో తగులుతోంది మరి!