బర్త్ డే విషెస్ లోనూ పవన్ స్టైల్ వేరబ్బా..!

Update: 2023-04-26 17:00 GMT
తమిళంలో దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టి అనుకోకుండా నటుడిగా మారిన సముద్రఖని తెలుగులో ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటుతున్నారు. తమిళంలో సూపర్ హిట్టైన వినోదయ సీతం సినిమాను తెలుగు వెర్షన్ తీస్తూ ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరం తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రీమేక్ సినిమా టైం లో పవన్ కి బాగా దగ్గరయ్యారు సముద్రఖని.

ఈ క్రమంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సముద్రఖనికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు పవన్ కళ్యాణ్. సముద్రఖనితో భీమ్లా నాయక్ నుంచి పరిచయం ఉందని ఆ సినిమాకు కూడా ఆయన సపోర్ట్ అందించారని పవన్ అన్నారు.

అంతేకాదు కుల రహిత సమాజం కోరుకునే వ్యక్తి.. సమాజం కోసం సినిమాలు చేస్తున్న దర్శకుడు, నటుడు అంటూ పవన్ కళ్యాణ్ తన సినిమాలో డైలాగులు మాదిరిగా సముద్రఖని గురించి బాగా రాసుకొచ్చారు.

సముద్రఖని బర్త్ డే విషెస్ అందిస్తూ పవన్ కళ్యాణ్ ఒక నోట్ రిలీజ్ చేశారు. అందులో సముద్రకని గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను పవన్ ప్రస్తావించడం అందరినీ సర్ ప్రైజ్ చేసింది.

ప్రస్తుతం సముద్రఖని పవన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 28న రిలీజ్ ఫిక్స్ చేశారు. అఫీషియల్ గా రిలీజ్ ఎనౌన్స్ మెంట్ ఇంకా రావాల్సి ఉంది. సముద్రఖని దర్శకుడిగా తన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.

ఇక నటుడిగా ఇప్పుడు తెలుగులో సూపర్ ఫాం లో ఉన్న వారిలో తను ఒకరు. యాక్టింగ్ డైరెక్షన్ రెండు చేస్తూ తన ఫాం కొనసాగిస్తున్నారు సముద్రఖని. వినోదయ సీతం రీమేక్ సినిమాతో హిట్ అందుకుంటే టాలీవుడ్ లో సముద్రఖని డైరెక్టర్ గా కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Similar News