షూటింగ్ చేస్తూనే అన్ని ట్వీట్లా?

Update: 2017-01-25 04:12 GMT
జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారా? ఇప్పుడీ ప్రశ్న చాలామందికి కలుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. గడిచిన రెండు మూడు రోజులుగా ఆయన చేస్తున్న ట్వీట్లు అన్నిఇన్ని కావు. జనవరి 26న వైజాగ్ ఆర్కే బీచ్ దగ్గర జరిగే మౌనదీక్షపై ఆయన చేస్తున్న ట్వీట్ల జోరుఒక రేంజ్లో సాగటమే కాదు.. సోషల్ మీడియాలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పవన్ నుంచి వస్తున్న ట్వీట్లతో.. జనవరి 26న ఆర్కే బీచ్ దగ్గరి నిరసన దీక్షపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మరి.. అంతలా హీట్ జనరేట్ చేస్తున్న పవర్ స్టార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న ఆరా తీస్తే షాక్ తినాల్సిందే. ఓపక్క తన ట్వీట్స్ తో ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించి.. అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆయన.. తాను మాత్రం కాటమరాయుడి షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉండటం విశేషం.

ఈ సినిమాలో శృతిహాసన్ తో జత కట్టిన పవన్.. తాజాగా సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్ పేటలో ఉన్న దుర్గా భవాని ఆలయంలో కీలక సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ కు పవన్ తో పాటు.. హీరోయిన్ శృతిహాసన్ లు పాల్గొన్నారు. కాటమరాయుడి షూటింగ్ గురించి తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షూట్ అయ్యాక పవన్ అక్కడ నుంచి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ఓపక్క వరుస ట్వీట్లు చేస్తూనే.. మరోవైపు షూట్ చేశారా? అన్నది ప్రశ్నగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ట్వీట్లను వరుసగా పోస్ట్ చేసేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.​


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News