హీరోల్లో పవన్ రూటే సపరేటు. పబ్లిక్ వేడుకలు అంటే అతడికి ఎలర్జీ. ఇప్పుడు రాజకీయాల్లో తప్పనిసరి కాబట్టి అప్పుడప్పుడు పబ్లిక్ లోకి రావాల్సొస్తోంది. ఇప్పుడిప్పుడే తన యాటిట్యూడ్ మార్చుకుంటున్నాడు. అయితే ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్లు అంటూ బాకా ఊదుడు కార్యక్రమాలకు వెళ్లడానికి ఎంత మాత్రం ఇష్టపడని పవన్ ఈసారికి మాత్రం ఎరక్కపోయి ఇరుక్కునేట్టే కనిపిస్తున్నాడు.
ఈనెల 23న నితిన్, సాయిధరమ్ ఆడియోలు రిలీజవుతున్నాయి. సేమ్ టైమ్, రెండు డిఫరెంట్ స్పాట్ లలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. నితిన్ హీరోగా నటించిన కొరియర్ బోయ్ కళ్యాణ్, సాయిధరమ్ హీరోగా నటించిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' రెండు సినిమాల ఆడియోలకు పవన్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఓవైపు ఫ్యాన్, మరోవైపు మేనల్లుడు ఈ ఇద్దరిలో పవన్ ఓటు ఎవరికి? ఏ ఆడియోకి అతడు వెళుతున్నాడు? అన్నది డిష్కసన్ పాయింట్ అయ్యింది.
నితిన్ తనకి వీరాభిమాని కాబట్టి, అతడి తండ్రి సుధాకర్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ పవన్ అక్కడికి వెళ్లాల్సిందే. అలాగని ఫ్యామిలీ హీరోని వదిలేస్తానంటే కుదరదు. కాబట్టి రెండు ఆడియోలకు విధిగా హాజరవ్వడానికే పవన్ ప్లాన్ చేస్తాడని అనుకుంటున్నారు. ఎరక్కపోయి ఇరుక్కున్నందుకు, టైమ్ అడ్జస్ట్ చేసుకోవాలి మరి. లేకపోతే రెండింటికీ హ్యాండచ్చి సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ చేసుకుంటాడేమో. వెయిట్ అండ్ సి.