అజ్ఞాతవాసిని అలా చూస్తున్నారా?

Update: 2018-01-03 07:46 GMT
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా సెన్సేషన్ అవుతోంది. గత నాలుగైదు రోజులుగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా దీని మీద ఫ్రెంచి మూవీ కాపీ అనే ముద్ర వేసి ఆన్ లైన్  లో ప్రచారం జరగడం తో  దాని గురించిన చర్చ తీవ్రంగా జరుగుతోంది. 2008లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ ది లార్గో వించ్(తెలుగులో అర్థం ‘చివరి వారసుడు)కి అజ్ఞాతవాసి ఫ్రీ మేక్ అనే పుకారు ప్రచారంలోకి రావడంతో తెలుగు మూవీ లవర్స్ ఆ సినిమా ఎక్కడ ఉందా అని ఆన్ లైన్ లో వెతకడం మొదలు పెట్టారు. వీరి అన్వేషణ ఫలించి ఆ మూవీ హింది డబ్బింగ్ రూపంలో ఉండటంతో పాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉంచడంతో బాష సమస్య రావడం లేదు. అధికశాతం ప్రేక్షకులకు హింది అర్థమవుతుంది కాబట్టి సినిమాని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వివాదం పుణ్యమా అని యు ట్యూబ్ లో దీనికి అమాంతం విజిట్స్ పెరిగిపోయాయి. దానికి తోడు ఆ సినిమా దర్శకుడు జెరోం సల్లె తనకు కూడా అజ్ఞాతవాసిపై ఆసక్తి ఉందని ట్వీట్ చేసారని తెలియడంతో దీని మీద ఆసక్తి రెట్టింపు అయ్యింది

చూస్తున్న వాళ్ళు కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ - ఖుష్బూ - ఆది పినిశెట్టి - గెస్ట్ గా కనిపించే వెంకటేష్ పాత్రలు ఏమై ఉంటాయా అనే అంచనాలలో లెక్కలు వేసుకుంటున్నారు. పవన్ - ఖుష్బూ పాత్రలు ట్యాలీ అయ్యాయని - ఆది అండ్ వెంకీ గురించి క్లారిటీ రావాలని అంటున్నారు చూసినవాళ్ళు. ఇది నిజమో కాదో తెలుసుకోకుండా అత్యుత్సాహంతో పవన్ ఫాన్స్ ఫ్రెంచ్ మూవీకి లేనిపోని ప్రచారం కల్పిస్తున్నారు అనే కామెంట్స్ కూడా లేకపోలేదు. మరో ఐదు రోజులు ఆగితే విడుదల అయ్యే సినిమాలో ఏముందో తెలుసుకోవడానికి ఇలా ఫ్రెంచ్ సినిమా చూడటం ఏమిటో చూస్తున్న వాళ్ళే చెప్పాలి. ఇంతవరకు యూనిట్ నుంచి దీని గురించి స్పందన లేదు. ఇది ఉట్టి ప్రచారమే అని - రిలీజ్ పనుల్లో  టీం మొత్తం బిజీగా ఉంటే లేనిపోని వార్తలు సృష్టించి సినిమా మీద వేరే అభిప్రాయం వచ్చేలా చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. వీటికి చెక్ పడాలి అంటే జనవరి 10 దాకా ఆగక తప్పదు. ముందు రోజే ప్రీమియర్ షోస్ వేయటం గురించి రేపో ఎల్లుండో క్లారిటీ రావొచ్చు .
Tags:    

Similar News