పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికర విషయాలపై మాట్లాడింది. మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ఈ ఇంటర్వ్యూలో రేణు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడమే అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ కు భర్తగా పదికి ఐదు మార్కులంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. అక్కడి నుంచి పవన్ అభిమానుల మీదికి కూడా టాపిక్ మళ్లించింది రేణు. పవన్ ఫ్యాన్స్ తనను ఎప్పుడూ ధ్వేషిస్తూనే ఉంటారని రేణు సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తావించాల్సిన విషయం.
ఈ ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన తేవడం.. కొన్ని నెగెటివ్ వ్యాఖ్యలు కూడా చేయడంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రేణు మీద అటాక్ మొదలుపెట్టారు. మా అన్నని వదిలిపెట్టవా.. ఎప్పటికీ అతని పేరు చెప్పుకుంటూ తిరుగుతావా అంటూ కొందరు అభిమానులు రేణును టార్గెట్ చేశారు. ఐతే ఇంతకుముందు కూడా పవన్ అభిమానుల నుంచి ఇలాగే వ్యతిరేకత ఎదుర్కొన్న రేణు.. ఈసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండున్నర గంటల ఇంటర్వ్యూలో పవన్ గురించి.. పిల్లల గురించి రేణు కనీసం ఇరవై నిమిషాల సేపు కూడా మాట్లాడలేదని.. అది మహిళా దినోత్సవం స్పెషల్ ఇంటర్వ్యూ అని ఇంటర్వ్యూయర్ మధ్యలో పవన్ అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. ఫాన్స్ అంటూ చెప్పుకుని తిరిగే వీళ్లంతా ఎప్పటికీ ఇంతేనని.. తనని ద్వేషిస్తూనే వుంటారని రేణు చాలా ఆగ్రహంగా స్పందించింది. కొందరు అభిమానులు రేణును ఊరడించే మాటలు చెప్పినా ఆమె శాంతించలేదు. ఈ నేపథ్యంలో రేణు ఇంకోసారి పవన్ గురించి ఇంటర్వ్యూలిచ్చే సాహసాలేమీ చేయకపోవచ్చేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/