పవన్‌ సినిమాలోనూ ఈమెనా?

Update: 2020-01-14 10:11 GMT
ప్రస్తుతం టాలీవుడ్‌ లో పూజా హెగ్డే టైం నడుస్తోంది. రెండు సంవత్సరాల ముందు వరకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంత జోరు కొనసాగించిందో ఇప్పుడు అదే జోరును పూజా హెగ్డే కొనసాగిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరికి కూడా మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యింది. ఇటీవలై అల వైకుంఠపురంలో అంటూ అల్లు అర్జున్‌ తో వచ్చిన ఈ అమ్మడు మరో వైపు ప్రభాస్‌ కు జోడీగా జాన్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం మాత్రమే కాకుండా ఇంకా రెండు మూడు పెద్ద సినిమాలకు కూడా ఈమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఇదే సమయంలో పూజా హెగ్డే కు పింక్‌ రీమేక్‌ లో ఛాన్స్‌ దక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ మూవీ పింక్‌ రీమేక్‌ అనే విషయం తెల్సిందే. దిల్‌ రాజు బ్యానర్‌ లో రూపొందబోతున్న ఈ చిత్రంకు శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్స్‌ ను పరిశీలించి అన్ని విధాలుగా పూజా హెగ్డే అయితే బాగుంటుందనే అభిప్రాయంకు వచ్చిన తర్వాత ఆమెతో సంప్రదింపులు మొదలు పెట్టారట.

పింక్‌ రీమేక్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌ 40 రోజుల డేట్లు ఇచ్చాడని ఆ మద్య వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుతం రాజకీయంగా చాలా బిజీగా పవన్‌ ఉన్నాడు. ఆ కారణాల వల్ల పింక్‌ రీమేక్‌ ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. పింక్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా పూర్తి అయిన తర్వాత పవన్‌ చకచక షూటింగ్‌ ముగించుకుని వెళ్తాడని అంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది ద్వితీయార్థంలో పవన్‌ పింక్‌ రీమేక్‌ తో వస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

Tags:    

Similar News