పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తానే అంతా అయిపోయి వన్ మ్యాన్ షో చేసేస్తూ వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్.. తొలిరోజు వసూళ్లలో చాలానే రికార్డులను బద్దలుకొట్టేసింది. అయితే.. సినిమాపై వచ్చిన రివ్యూలు - వస్తున్న రిపోర్టులు మాత్రం.. పవన్ ని ఖచ్చితంగా నిరుత్సాహపరిచేవే. నిజానికి ఈ మూవీ కోసం పవన్ చాలానే కష్టపడ్డాడు.
తన అభిమానులకు అంకితం ఇచ్చేందుకు.. వారి కోసం ఎన్నో పాట్లు పడ్డాడు. తాను అంత స్వేచ్ఛగా చేయలేకపోయినా.. బోలెడన్ని డ్యాన్సులు కూడా చూశాడు. ఇలా పవన్ ఎంతో కష్టపడి గతంలో రూపొందించిన చిత్రం జానీ. ఆ సమయంలో పవన్ నుంచి ఓ మాస్ మసాలా ఎంటర్టెయినర్ ఆశించారు అభిమానులు. కానీ పవర్ స్టార్ మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఆశ్చర్యపరచడమే కాదు.. అభిమానులను నిరుత్సాహపరిచాడు. ఇప్పుడేమో అంతా డిఫరెంట్ కాన్సెప్ట్ లకు ఆదరణ దక్కుతున్న రోజులు. ఇలాంటి టైంలో పవన్ మాత్రం ఓ రొటీన్ కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పవన్ కి ఉన్న ఈ క్రేజ్.. తొలి రోజు వరకో, వీకెండ్ పూర్తయ్యే వరకో వసూళ్లు తెచ్చేందుకు సరిపోతుంది. కానీ.. పవన్ మాత్రం ట్రెండ్ ను క్యాచ్ చేయలేదనే చెప్పాలి. తానే ట్రెండ్ ని సృష్టిస్తానని చెప్పడం కరెక్టే కానీ.. జనాల టేస్ట్ ని కూడా అందుకోవాలిగా.