​పవన్ పయనానికి డేట్ ఫిక్సైంది

Update: 2017-07-10 04:34 GMT
తెలుగులో ఇప్పుడు స్టార్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అందులో పవన్ కల్యాణ్ అండ్ త్రివిక్రమ్ సినిమా ఒకటి. పవన్ సినిమా అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది జనాలలో ఇప్పుడు అది మరింత ఎక్కువ అయ్యింది త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో. ఈ సినిమాను తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తునట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ సన్నివేశాలు యాక్షన్ సీక్వెన్స్  హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ షెడ్యూల్ ఇంకా రెండు మూడు రోజులలో పూర్తి కూడా కావస్తుంది అని తెలుస్తోంది. ఆ తరువాత వెంటనే 20 రోజులు షెడ్యూల్ కోసం బల్గేరియా దేశం వెళుతున్నారు  పవన్ అండ్ టీమ్. ఈ నెల 19 నాడు మొత్తం టీమ్ అంతా అక్కడకు వెళ్తునట్లు తెలిసింది. బల్గేరియా లో రెండు పాటలు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేస్తారట. అక్కడ పరిసరాలలలో కొండలు నది ప్రాంతాలలో పాటలు షూట్ చేయడానికి అనువైన ప్రాంతం అని చెబుతున్నారు. గతంలో అత్తారింటికి దారేది సినిమాలో స్పెయిన్ లో పాటలను తీసి.. అక్కడే కొన్ని సీన్స్ కూడా తీశారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారట.

పవన్ సినిమాలో పాటలు ఏ రేంజు హిట్ అవుతాయో తెలిసిందే. సినిమా ఎలా ఉన్నా పాటలు మాత్రం హిట్ అవుతాయి. కాని విశేషం ఏంటంటే.. కాటమరాయుడు సినిమా పవన్ లైఫ్‌ లోనే తొలి మ్యూజికల్ డిజాష్టర్. మరి ఇప్పుడు ఈ సినిమా కోసం అనిరుథ్ అందించిన పాటలు ఎలా ఉన్నాయో తెలియదు కాని.. వాటికి విజువల్స్ అద్దగానే అదిరిపోతాయ్ అంటూ ఈ యునిట్ చెబుతున్నారు. లెటజ్ సీ.
Tags:    

Similar News