సెలబ్రెటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు దాచే కొద్దీ ఆసక్తిని రేకెత్తిస్తాయి. పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతుంటుంది. పవన్ వ్యక్తిత్వం మిగతా హీరోలకు చాలా భిన్నంగా ఉంటుంది. అందరిలా బయట తిరగడు. పార్టీలు.. వేడుకల్లో కనిపించడు. వ్యక్తిగత జీవితం అంతా రహస్యంలాగా ఉంటుంది. అందుకే పవన్ ప్రైవేట్ లైఫ్ కు సంబంధించి ఏ చిన్న విషయమైనా జనాల్లో భలే ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమాలు లేనపుడు ఎక్కువగా పవన్ హైదరాబాద్ శివార్లలోని తన ఫాం హౌస్ లో గడుపుతాడన్న సంగతి తెలిసిందే. అక్కడ పవన్ ఎంత సింపుల్ గా గడుపుతాడో.. త్రివిక్రమ్ లాంటి మిత్రులు చెబుతుంటే జనాలకు భలే ఇంట్రెస్టింగా అనిపిస్తూ ఉంటుంది.
ఐతే పవన్ ఫామ్ హౌస్ లో ఉన్నప్పటి ఫొటోలు బయట కనిపించడం అరుదు. ఆ మధ్య ఫాం హౌస్ నుంచి ఓ ఇంటర్వ్యూ ఇస్తే.. అవి హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఎవరో పవన్ తన ఫాం హౌస్ లో తిరుగుతుండగా ఓ ఫొటో తీశారు. జీన్ ప్యాంట్.. గళ్ల చొక్కా.. స్లిప్పర్స్ వేసుకుని.. చేతులో గొడుగు పట్టుకుని చాలా మామూలుగా కనిపిస్తున్నాడు పవన్ ఇందులో. వెనుక లేగదూడ.. రెండు మూడు ఆవులు కనిపిస్తున్నాయి. వాతావరణం అంతా చాలా సహజంగా కనిపిస్తోంది. పవన్ ను చూస్తే ఆ పశువుల్ని కాచుకుంటున్న సామాన్యుడిలాగే కనిపిస్తున్నాడు. ఇలాంటి అవతారంలో పవన్ ను చూడటం అభిమానులకు చాలా కొత్త అనుభవమే.