పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుందని ఇప్పటికే చెప్పుకున్నాం. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా.. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ముందుకు జరిపినట్లు తెలుస్తోంది.
తెలుగు సంవత్సరాది సందర్భంగా మార్చ్ 28న కాటమరాయుడు మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయగా.. ఇప్పుడీ డేట్ ని కొన్ని రోజులు ముందుకు జరపడం ఖాయం అంటున్నారు. కాటమరాయుడు మూవీని మార్చ్ 24నే విడుదల చేసేయబోతున్నారట కూడా. మార్చ్ రెండో వారం చివరకే అన్ని పనులు పూర్తయిపోనుండడంతో.. ఇలా విడుదల తేదీ మార్చుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం హీరో హీరోయిన్లపై మాంచి ఫోక్ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన కాటమరాయుడు ఆల్బం మొత్తానికి.. ఇదే హైలైట్ సాంగ్ కానుందని టాక్.
మరోవైపు ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేయగా.. అవి కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి. మరో పాట కూడా పిక్చరైజ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. అన్నీ కలిపినా కూడా.. మార్చ్ మూడవ వారం ప్రారంభానికల్లా కాటమరాయుడు ఫస్ట్ కాపీ చేతిలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే.. రిలీజ్ డేట్ ని ముందుకు జరిపే యోచనలో ఉన్నారట కాటమరాయుడు నిర్మాతలు. చెప్పిన డేట్ కంటే ముందే రావడం అంటే.. పవన్ సినిమాల్లోనే ఇదో అరుదైన రికార్డుగా చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/