సరిగ్గా త్రివిక్రమ్ ఆడియో ఫంక్షన్‌కు బయలుదేరుతుంటే.. అప్పుడే పవన్ కల్యాణ్ ఫోన్‌లో ఒక విషయం అడిగాడట. ''నా గురించి ఫ్యాన్స్ అడిగితే మీరు ఏం చెబుతారు??'' అన్నాడట పవన్. దానికి రిప్లయ్ ఇస్తూ త్రివిక్రమ్ ఏమన్నాడంటే.. ''దేవుడినీ చూడటానికి మనమే వెళ్ళాలి'' అని చెప్పాడట. ఇదంతా స్వయంగా సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో లాంచ్‌లో త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. బాగానే ఉంది. దీనిబట్టి అర్ధమయ్యేదేంటంటే.. మెగా హీరోలకు చెందిన ఫంక్షన్స్‌లో కొంతమంది అభిమానులు పవర్‌స్టార్ అని అరుస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారనే విషయం పవన్‌కు తెలుసనమాట.
ఇక్కడే పవన్ కళ్యాణ్‌ను ఒక ప్రశ్న అడగాలి మరి. ఏంటంటే.. అసలు పవన్ గురించి అభిమానులు అరవడం అనేది ఒకప్పుడు ఏదో క్రేజీగా ఉండేది కాని, ఇప్పుడు మాత్రం కాస్త చిరాకుగా అనిపిస్తోంది. ప్రతీసారీ పవన్ కళ్యాణ్ రాడు అని తెలిసి కూడా అభిమానులు ఎందుకు అరుస్తారో తెలియదు. ఇక తనకోసం అరుస్తారని తెలిసినప్పుడు, పవన్ అయినా వారిని శాంతంగా ఉండాలని ఓసారి చెప్పొచ్చుగా? వేరే ఈవెంట్స్‌లో నా గురించి అరవకండి అంటూ ట్విట్టర్‌లో చెప్పొచ్చు, లేకపోతే సదరు ఈవెంట్‌లో ఉన్న మెగా హీరోలకు వీడియో ద్వారా ఆల్ ది బెస్ట్ అనే సందేశం పంపొచ్చు. స్వయంగా మెగస్టార్ చిరంజీవిని సైతం ఈ అభిమానులు ఎలా ఇబ్బంది పెట్టేశారో తెలిసిందే. అలాంటప్పుడు పవన్ రంగంలోకి దిగితే బెటర్ కదా? అన్నీ తెలిసీ సైలన్స్ ఏంటమ్మా పవర్‌స్టార్...