పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెద్ద సంకటంలో పడిపోయాడు. ఈ నెల 28న అన్నయ్య చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. బెంగళూరులో ఈ మ్యారేజ్ ని అత్యంత వైభవంగా జరపనున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కావడం డౌట్ అంటున్నారు. దీనికి కారణం ఇప్పటికే సర్దార్ కి సంబంధించిన రెండు పాటల షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్విటర్లాండ్ వెళ్లిపోవడమే.
సర్దార్ మూవీని ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు యూనిట్ అన్ని రకాలు గాను ప్రిపేర్ అయిపోతున్నారు. మూవీని ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేసేది లేదని తేల్చేశారు కూడా. అయితే ఈ ఇబ్బంది పై అన్నయ్యతో చర్చించాడు పవన్. ఏప్రిల్ 1 - 2 తేదీల కల్లా సెన్సార్ బోర్డ్ కు కాపీ ఇవ్వాలంటే.. ఈ పాటల షూటింగ్ కంపల్సరీ. ఈ విషయాన్ని చిరు అర్ధంచేసుకున్నారని అంటున్నారు. 'శ్రీజ పెళ్లికి రాకపోయినా పర్లేదు. నీ ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని తెలుసు. సర్దార్ గబ్బర్ సింగ్ ని పర్ఫెక్ట్ గా పూర్తి చెయ్. టెన్షన్స్ పెట్టుకోవద్దు' అని పవన్ కి చిరంజీవి చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే షెడ్యూల్ ప్రకారం పవన్ ఈ నెల 28న ఇండియాకి రానున్నాడు. ఇలా ఇండియాకి రావడమే డైరెక్టుగా బెంగళూరు వెళ్లిపోయి శ్రీజ మ్యారేజ్ కి అటెండ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వీలైనంతవరకూ సర్దార్ ని, కూతురు పెళ్లిని.. దేన్నీ మిస్ కాకుండా ఉండేలా పవన్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.