ఇంతకీ పవన్ అక్కడేం చేశాడు?

Update: 2015-10-31 11:30 GMT
కొండంత రాగం తీసి.. అన్న సామెతే గుర్తుకొస్తోంది పవన్ కళ్యాణ్ వ్యవహారం చూస్తుంటే. ఈ మధ్య మనోడిని అమరావతి శంకుస్థాపనకు రమ్మంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆహ్వానం పలికిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఐతే తాను షూటింగు కోసం గుజరాత్ కు వెళ్లాల్సి ఉందని..  ఇప్పుడు కుదరదని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. చెప్పినట్లే తన యూనిట్ తో కలిసి గుజరాత్ కు వెళ్లాడు పవన్. తాను గుజరాత్ లో ఉన్నానడానికి సాక్ష్యంగా తన యూనిట్ సభ్యులతో కలిసి ఓ పరేడ్ కూడా నిర్వహించి.. ఫొటో కూడా మీడియాలో వచ్చేలా చూసుకున్నాడు.

ఐతే అంతా చేసి.. చివరికి గుజరాత్ లో షూటింగే చేయకుండా వెనక్కి వచ్చాడట పవన్. కేవలం తన యూనిట్ సభ్యులతో కలిసి గుజరాత్ లో లొకేషన్లు మాత్రం చూసి వచ్చాడట. మళ్లీ నవంబరు నెలాఖరులో అక్కడికి టీంతో కలిసి వెళ్లబోతున్నాడట. ఐతే లొకేషన్లు చూడ్డానికే అయితే డైరెక్టర్ - ప్రొడ్యూసర్ - తాను.. ఇంకో ఇద్దరు ముగ్గుర్ని వేసుకుని వెళ్లాలి కానీ.. మొత్తం యూనిట్ సభ్యులందరినీ అక్కడికి తీసుకెళ్లడమేంటో అర్థం కాని విషయం. ఐతే నిజానికి గుజరాత్ లో షూటింగ్ చేద్దామన్న ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లాడని.. ఐతే లొకేషన్ల విషయంలో ఏం క్లారిటీ లేకపోవడంతో అక్కడికెళ్లాక మనసు మార్చుకున్నాడని.. ఈసారి ప్లానింగ్ కు పరిమితమై.. మళ్లీ ఇంకోసారి లాంగ్ షెడ్యూల్ షూట్ చేద్దామని ఫిక్సయ్యాడని సమాచారం.
Tags:    

Similar News