''నేనే ఒక ఫ్రెషర్ గా వచ్చి.. ఇక్కడ యాక్టింగ్ లో సక్సెస్ అయ్యాను. నేనే సక్సెస్ అయినప్పుడు ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. సో.. నేను ఇంకొకరితో తప్పొప్పులు వెతికి.. వారిని ఎలా జడ్జ్ చేయగలను? నాకు అది చేతకాదు'' అంటూ చెప్పుకొచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
రేపు తన ''సర్దార్ గబ్బర్ సింగ్'' సినిమా రిలీజవుతున్న తరుణంలో.. అసలు మనోడు అన్ని ఫ్లాపులు ఎందుకు కొట్టాడు.. ఒక దర్శకుడిని నమ్మాలంటే ఏం చూస్తాడు అనే విషయాలపై టాపిక్ వచ్చినప్పుడు పవన్ పై వ్యాఖ్యలు చేశాడు. ''ఎదుటవారు గతంలో చేసిన వర్కును చూసి వారిని జడ్జ్ చేయడం అనేది చాలా కష్టం. ఒక సినిమా ఫెయిల్ అయ్యిందంటే.. దానికి దర్శకుడు కారణం కాదు. ఒక్కోసారి చుట్టూ తనకి కలసి రావల్సిన అంశాలు సరిగ్గా లేనప్పుడు కూడా సినిమాలు ఫెయిల్ అవుతాయి'' అంటూ హితబోధ చేశాడు పవన్.
మొత్తానికి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా మెగాస్టార్ చిరంజీవి బాటలోనే వెళ్తున్నారని చెప్పొచ్చు. గతంలో ఇలాగే మూడు ఫ్లాపులు వరుసగా తీసిన కె.రాఘవేంద్రరావు చేతిలో ఒక కొత్త సినిమా స్ర్కిప్టును పెట్టొద్దు.. మనకి బిజినెస్ వర్కవుట్ అవదు.. అని పంపిణీదారులు వారించినా కూడా.. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తీయించారు చిరు. ఆ విషయం స్వయంగా రాఘవేంద్రరావే తెలియజేశారు. ఆ సినిమా రిజల్టు తెలిసిందే.