ఆ స్టార్స్‌ కు పవర్‌ స్టార్‌ సెల్యూట్‌

Update: 2020-03-28 03:51 GMT
ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దంను ప్రకటించాయి. ఇప్పటికే లాక్‌ డౌన్‌ ను ప్రకటించిన ప్రభుత్వాలు పేదలకు సాయం చేసేందుకు ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వంకు బాసటగా ప్రతి ఒక్కరు ఉండాలి. పేదలను ఆదుకునే పనిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో స్టార్స్‌ ముందడుగు వేస్తున్నారు. తుఫాన్‌ లు భూకంపాలు వచ్చిన సమయంలో చాలా యాక్టివ్‌ గా ఉండి విరాళాలు ఇచ్చే స్టార్స్‌ ఈసారి కూడా కరోనాపై యుద్దం సమయంలో పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు.. ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు.

టాలీవుడ్‌ నుండి పలువురు స్టార్స్‌ వారి స్థాయిని బట్టి కోట్లల్లో లక్షల్లో విరాళాలు ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా రెండు కోట్ల విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే. తనతో పాటు ఈ విపత్తుకు విరాళంను అందించిన టాలీవుడ్‌ స్టార్స్‌ కు పేరు పేరున పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌ లో అభినందనలు తెలియజేశాడు. విరాళాలు ప్రకటించిన స్టార్స్‌ పేర్లను ప్రస్తావిస్తూ వారిని అభినందిస్తూ పవన్‌ చేసిన ట్వీట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నాలుగు కోట్ల రూపాయలను కరోనాపై యుద్దంకు విరాళంగా ప్రకటించిన శ్రీ ప్రభాస్‌ తన పెద్ద మనసును చాటుకున్నారు. సమాజ క్షేమం గురించి ఆలోచించే శ్రీ మహేష్‌ బాబు కోటి రూపాయలు ఇచ్చి సమాజం పట్ల తనకున్న ఆపేక్షను వ్యక్తం చేశారు. నా అన్న బిడ్డ రామ్‌ చరణ్‌ తన తండ్రి అడుగు జాడల్లో పయనిస్తూ తనకంటూ సేవా భావం ఏర్పర్చుకుని 75 లక్షల విరాళంను ప్రకటించారు. మరో యువ శక్తి ఎన్టీఆర్‌ కూడా విరాళం ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నందుకు అభినందనలు.

అల్లు అర్జున్‌ 1.25 కోట్ల విరాళంను అందించి ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. సినిమా కుటుంబం నుండి తొలి విరాళంగా 20 లక్షల రూపాయలు ఇచ్చిన శ్రీ నితిన్‌ ను మెచ్చుకుని తీరాల్సిందే. సినిమా హీరోగా నిలదొక్కుకుంటున్న సాయి ధరమ్‌ తేజ్‌ 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇక దర్శకులు సినీ నిర్మాతలు కూడా విరాళాలు ఇచ్చినట్లుగా పవన్‌ పేర్కొని వారిపై ప్రశంసలు కురిపించారు. ఇక తన అన్నయ్య చిరంజీవి సినీ కార్మికుల కోసం ఇచ్చిన కోటి విరాళంపై కూడా పవన్‌ ప్రశంసలు కురిపించాడు. మొత్తానికి టాలీవుడ్‌ నుండి కరోనా సహాయార్థం విరాళాలు ఇచ్చిన స్టార్స్‌ అందరికి కూడా పవర్‌ స్టార్‌ సెల్యూట్‌ చేస్తూ అభినందించారు.
Tags:    

Similar News