బ్రూస్ లీ కి బాబాయ్.. స్పెషల్ షో

Update: 2016-04-09 09:45 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ లు కలిసి కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆన్ స్క్రీన్ పై కాకపోయినా.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం వీరిద్దరు కలిసి సందడి చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ స్పెషల్ షో చూశారు బాబాయ్ - అబ్బాయ్ లు.

సర్దార్ విడుదల రోజున.. పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ లు ఈ మూవీని ప్రసాద్ కలర్ ల్యాబ్ లో ప్రత్యేకంగా షో వేయించుకుని చూశారు. వీరిద్దరితోపాటు.. నిర్మాత శరత్ మరార్ - డైరెక్టర్ బాబీలు కూడా ఈ ప్రదర్శనను తిలకించారు. అబ్బాయ్ కి తన సినిమాని ప్రత్యేకంగా షో వేయించి మరీ చూపించాడన్న మాట పవన్. అయితే. నా అభిమానులకు అంకితం అంటూ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని మొదలుపెడతాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మూవీ మధ్యలో ఓ డైలాగ్ వస్తుంది. పవర్ స్టార్ ఫైట్ చేస్తుండగా 'బ్రూస్ లీకి బాబాయ్ లా ఉన్నాడన్నా' అంటాడు రౌడీ గ్యాంగ్ లో ఒకడు.

తనను - తన సినిమాని గుర్తు చేస్తూ... పవన్ కళ్యాణ్ మూవీలో డైలాగ్ ని చెప్పించడాన్ని.. రామ్ చరణ్ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడని అంటున్నారు. మెగాభిమానులు ఎంజాయ్ చేసేలా జాగ్రత్త పడ్డ పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ బ్రూస్ లీని కూడా ఉపయోగించుకోవడం విశేషం అనే చెప్పాలి.
Tags:    

Similar News