గుజరాత్ రూట్ లో పవర్ స్టార్..

Update: 2015-10-17 13:57 GMT
సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడు.. ఇన్నాళ్లూ ఓ ఫోటో తప్ప పెద్దగా తెలీదు కానీ.. రీసెంట్ గా రెండు ఎపిసోడ్స్ కారణంగా పవన్ కళ్యాణ్ లుక్ తెలిసిపోయింది. సేమ్ డిట్టో గబ్బర్ సింగ్ లో ఉన్నట్లుగానే కనిపిస్తున్నారు. ఖాకీ షర్ట్ కి పై నాలుగు గుండీలు పెట్టడం మానేసి.. బాగా రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు. నిఖిల్ నటించిన శంకరాభరణం టీజర్ లాంఛ్ ని, సర్దార్ సెట్స్ పైనే పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. గబ్బర్ సింగ్ లుక్ తోనే ఈ కార్యక్రమాన్ని కూడా కానిచ్చేశాడు.

ఎలా ఉంటాడో తెలిసిపోయింది. మరి షూటింగ్ ఎంతవరకూ వచ్చింది, నెక్ట్స్ ఎక్కడ షూట్ చేయబోతున్నారు అనే ఆసక్తి నెలకొంది. ఈ వారం చివర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ గుజరాత్ వెళ్లబోతోంది. అక్కడ 25 రోజుల పాటు షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. గుజరాత్ లోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాతంలో ఈ షూటింగ్ జరగనుంది.

ఓ ఫైట్ తో పాటు మూవీలో కీలకమైన తొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. నిజానికి ఈ సన్నివేశాలను జూన్ లోనే తీయాల్సి ఉంది. అయితే.. అప్పటికి యూనిట్ కి షూటింగ్ కోసం అవసరమైన పర్మిషన్స్ రాకపోవడంతో.. అఫ్పటి షెడ్యూల్ లో కొంత భాగం కేన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు అన్నీ సక్రమంగా పూర్తి చేసుకుని గుజరాత్ బయల్దేరుతున్నారు మొత్తం యూనిట్. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ నటించిన ఈ మూవీకి డైరెక్టర్ బాబీ. పవన్ ఫ్రెండ్ శరత్ మరార్. ఈరోస్ ఇంటర్నేషనల్ కంపెనీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Tags:    

Similar News