అసలు పవన్ కళ్యాన్ సింగపూర్ వెళ్తున్నాడనే న్యూస్ ఎలా బయటలకు వచ్చిందో తెలియదు. కాకపోతే మనోడు మూడు రోజులు సింగపూర్ వెళుతున్నాడనే విషయం దావనంలా వ్యాపించింది. పైగా అదే సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా సింగపూర్ టూర్ వెళుతున్నారు కాబట్టి.. ఇద్దరూ అక్కడ సీక్రెట్ మీటింగ్ వేశారనేది పొలిటికల్ యాంగిల్ నుండి వచ్చిన ఎనాలసిస్. ఈ కథకు ట్విస్టిస్తూ.. హైదరాబాద్ లో షూటింగులో ఇంజూర్ అవ్వడంతో.. బ్యాక్ సర్జరీ చేయించుకోవడానికి గతంలో ఫారిన్ వెళదాం అనుకున్న పవన్ ఇప్పుడు వెళ్తున్నాడే న్యస్ ఒకటి వచ్చింది. దీనంతటికీ ఫైనల్ క్లోజింగ్ ఇచ్చారు నిర్మాత శరత్ మరార్.
''పవన్ కళ్యాణ్ సమ్మర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ ను రిలీజ్ చేయాలనే ధృఢ నిశ్చయంతో ఉన్నాడు. అందుకే హైదరాబాద్ లో ఎగ్రెసివ్ గా సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కానిస్తున్నారు'' అంటూ సోషల్ నెట్వర్క్ లో పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాన్ సింగపూర్ వెళితే ఇక్కడ యునిట్ షూటింగ్ కానిస్తున్నారా? లేకపోతే పవన్ ఇక్కడే ఉన్నారా? అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కాని జనసేనాని సింగపూర్ యాత్ర సేయట్లేదని మాత్రం స్పష్టం అవుతోంది. ఒకవేళ ఎపి సిఎం ను కలుస్తున్నాడు అనే న్యూస్ రావడంతో తన ప్రయాణానాన్ని వాయిదా వేసుకున్నాడా? ఇలాంటి ఆన్సర్ లేని ప్రశ్నలు చాలా వినిపిస్తున్నాయి. సర్లేండి.. సర్దార్ అయితే సమ్మర్ ట్రీట్ ఇవ్వబోతున్నాడంతే. అందులో మాత్రం నో ఛేంజ్.