మళ్ళీ మళ్లీ అందరికే అదే సందేహం వచ్చేస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ డైయిరీస్ పేరుతో వస్తున్న ప్రమోషన్ మెటీరియల్.. రోజూ పవన్ కళ్యాణ్ భజనతోనే నిండిపోతోంది. కాని దీని వలన ఒక వ్యక్తికి తీరని నష్టం జరుగుతోందని వేరే చెప్పక్కర్లేదు.
పవన్‌కళ్యాణ్ స్వయంగా రచించిన సినిమా ''సర్దార్''. అయితే ఈయనేమీ విపరీతంగా ప్రూవ్ చేసుకున్న రచయిత ఏమీ కాదు. ఆయన తొలి రచన 'జానీ' అట్టర్ ఫ్లాప్. అయినాసరే ఇప్పుడు మాత్రం పవన్ రచన అద్భుతం అంటూ ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు ఆయన స్నేహితుడు.. నిర్మాత శరత్ మరార్. బాగానే ఉంది. అయితే ఈ సినిమాను డైరక్ట్ చేసిన దర్శకుడు కె.ఎస్.రవీంద్ర ఎలియాస్ బాబీ గురించి ఎక్కడ ప్రస్తావించకుండా.. కేవలం పవన్ గురించి ప్రమోషన్ అంతా ఫోకస్ చేయడం బాగాలేదు. ఏదో సెలూన్ లో కూడా పవన్ అక్కడే కూర్చొని క్రియేటివ్ చర్చలు జరిపేవారు అంటున్నారు కాని.. అందులో ఒక్కసారి కూడా బాబీ పేరును మెన్షన్ చేయలేదు.
పవన్ టాలెంట్ ఏంటి అనేది మనం ఏప్రియల్ 8న చూస్తాం. కాకపోతే ఇప్పటికే ''పవర్'' వంటి సినిమాతో హిట్టు కొట్టిన బాబీ ని కూడా కాస్త ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే సినిమాకు డైరక్టర్ ఆయనే కదా.