పవన్ కన్నా తారకే ఇష్టం: అకీరా

Update: 2018-06-27 11:30 GMT
రేణు దేశాయ్ కి రెండో పెళ్లి కుదిరింది. ఇక తన వ్యక్తిగత విషయాలు సినిమాలకు ఏ మాత్రం సంబంధం లేనివి కాబట్టి ఇక ముందు చర్చకు రాకపోవచ్చు. కానీ పవన్ ద్వారా కలిగిన అకీరా నందన్ మాత్రం ఫాన్స్ దృష్టిలోనే ఉంటాడు. దానికి కారణం రేణు ఇష్టం లేదని చెబుతున్నా ఏదో ఒక రోజు అకీరా తెరంగేట్రం చేయకపోతాడా అప్పుడు పవన్ వారసుడు అని మేం చెప్పకపోతామా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానికి ఇంకా టైం పట్టేలా ఉంది కానీ ఇటీవలే అకిరా విజయవాడ వచ్చి పవన్ ని కలిసి నాన్న వెంటే ఉండటం వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసాం.

తాజాగా తెలిసిన అప్ డేట్ ప్రకారం విజయవాడలో తనను కలిసిన ఫాన్స్ తో పవన్ సరదాగా మాట్లాడుతున్నప్పుడు అకీరా ప్రస్తావన వచ్చింది. తన కొడుకు తనకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటేనే బాగా ఇష్టపడతాడని అతని డాన్సుల కోసమే సినిమాలు చూస్తాడని చెప్పాడట. దీంతో షాక్ తిన్న ఫాన్స్ పవన్ తో పాటు నవ్వుకు శృతి కలపడం ఇలా సాగిపోయిందట. ఇది ప్రైవేట్ టాక్ కాబట్టి సాక్ష్యం చూపలేం కానీ నిజమే కావొచ్చు. గతంలో ఓ ఇంటర్వ్యూలో అకీరాకు జూనియర్ అంటే ఇష్టం అన్న సంగతి రేణు దేశాయ్ కూడా చెప్పింది. సో పై సంఘటన అబద్దం అనుకోవడానికి లేదు. అసలే తారక్ అభిమానులు  మెగా ఫాన్స్ బాగా దగ్గర అవుతున్నాడు. రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ కు చేతులు కలిపాక ఇద్దరి హీరోల అభిమానుల మధ్య ఒకరకమైన మంచి వాతావరణం నెలకొంది.

అరవింద సమేత వీర రాఘవ ఓపెనింగ్ సమయంలో పవన్ తారక్ చాలా ఆత్మీయంగా మాట్లాడుకోవడం అందరికి గుర్తే. ఈ నేపథ్యంలో పవన్ తన కన్నా ఎన్టీఆర్ నే అకీరా ఇష్టపడటాన్ని ఓపెన్ చెప్పి ఉండొచ్చు. మెగా ఫామిలీలోనే చరణ్ బన్నీ లాంటి డాన్సర్స్ ఉండగా ప్రత్యేకంగా తారక్ డాన్సులకు ఫ్యాన్ అయిపోయిన అకీరా కూడా మంచి డాన్సర్ గా మారితే  నాన్న అంతగా సక్సెస్ కాలేకపోయిన డాన్స్ విషయంలో తానేంటో ఋజువు చేసుకోవచ్చు. కానీ అది టాలీవుడ్ ఎంట్రీ ఉంటేనే సుమా. మరి అది జరుగుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.
Tags:    

Similar News