మంచినీళ్లతో మనసు దోచిన పవన్

Update: 2017-06-22 07:26 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మానవతా వాదిగా పేరుంది. అతను మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నగరం నడిబొడ్డున షూటింగ్ జరుతుండటంతో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు స్టూడియో దగ్గరికి వస్తున్నారు. ఎండలో పవన్ కోసం గంటల తరబడి ఎదురు చూస్తున్నారు.

నిన్న తన కోసం చూస్తున్న అభిమానుల దగ్గరికి వచ్చి వారికి అభివాదం చేసిన పవన్.. కాంపౌండ్ వాల్ దగ్గర కొందరు అభిమానులు చాలా డీలా పడ్డట్లు గమనించి.. ప్రొడక్షన్ వాళ్లను పిలిచి వారి కోసం మంచినీళ్ల బాటిళ్లు తెప్పించి వారందరికీ పంచమని చెప్పాడు. తమ అభిమాన కథానాయకుడు ఇలా తమను పట్టించుకోవడం చూసి అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇలా ఇంకా హీరో చేయడంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పవన్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

సగానికి పైగా షూటింగ్ పూర్తయిన అనంతరం కొన్నాళ్ల పాటు పవన్-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు సారథి స్టూడియోలో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఇంకో రెండు నెలల్లో షూటింగ్ పూర్తయ్యే అవకాశముంది. ముందు దసరాకు అనుకున్న ఈ సినిమాను తర్వాత సంక్రాంతికి వాయిదా వేసినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడేమో అక్టోబరు లేదా నవంబర్లో రిలీజ్ అంటున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్.. అను ఇమ్మాన్యుయెట్ కథానాయికలుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ మిత్రుడు రాధాకృష్ణ నిర్మాత.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News