పవన్ కళ్యాణ్ తమిళ్ హీరో అజిత్ సినిమా పై మనసు పారేసుకున్నాడట. 2104 లో అజిత్ నటించిన 'వీరం' చిత్రాన్ని ఆ మధ్య పవన్ చూశాడట. అప్పటి నుంచి ఆ కథ పవన్ ని వెంటాడుతోందట. కానీ సర్దార్ సినిమా బిజీ లో పడి దాన్ని కొంత కాలం పక్కకు పెట్టాడట పవన్. అయితే తాజాగా ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు ద్వారా తెలుస్తోంది.
అజిత్- తమన్నా జంటగా నటించిన వీరం చిత్రం తమిళ్ లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా భారీ వసూళ్లనే రాబట్టింది. యాక్షన్ - ఎమోషన్స్ - కామెడీ అన్నీ సమపాళ్లలో ఉండటంతో ఈ సినిమా పవన్ కు బాగా నచ్చిందట. అన్నీ కుదిరితే... సర్దార్ తర్వాత చేయబోయే చిత్రమిదే అంటున్నారు సినీ పరిశీలకులు. అయితే ఆ మధ్య పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా చేయనున్నాడంటూ వార్తలు వచ్చాయి. అది ఈ సినిమానే కావొచ్చని తెలుస్తోంది. దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది.