పవర్ స్టార్ కంటే మెగాస్టారే టాప్

Update: 2018-01-19 02:30 GMT
ప్రస్తుత రోజుల్లో టాలీవుడ్ మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాకు పెట్టిన బడ్జెట్ రెండు మూడు రోజుల్లో వచ్చేస్తున్నాయి. అది కూడా టాక్ బావుంటేనే. ఒకవేళ బాలేదంటే రెండవరోజు మొదటి ఆటకు అసలు రంగు తేలిపోతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఈ రోజుల్లో విడుదలైన మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద ఎదో విధంగా సరికొత్తగా రికార్డులను నమోదు చేస్తున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అంచనాల నడుమ విడుదలైన సినిమా కాబట్టి మొదటి రోజు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ రెండవరోజు డివైడ్ టాక్ రావడంతో దారుణమైన డిజాస్టర్ అందుకున్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అయితే ఊహించని స్థాయిలో ఓటమిని మూటగట్టుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తుండడంతో మొదట ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు చెలరేగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  సినిమాకు మొదటి వారం కలెక్షన్స్ మొత్తంగా రూ.50 కోట్లు మాత్రమే వచ్చాయి. టాలీవుడ్ డిజాస్టర్స్ లలో అజ్ఞాతవాసి ఒకటిగా నిలిచింది.

ఇకపోతే గత ఏడాది ఇదే సమయానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి - ఖైదీ నెంబర్ 150 మాత్రం మొదటి వారం రూ.77 కోట్లను కలెక్ట్ చేసింది. పవన్ కెరీర్ లో అత్తారింటికి దారేది సినిమా ఎక్కువ వసూళ్లను అందుకుంది. గత ఏడాది వరకు మెగా ఫ్యామిలీ లో పవన్ స్థానం టాప్ లో కొనసాగింది. కానీ చిరు రీ ఎంట్రీ తరువాత బాక్స్ ఆఫీస్ లెక్కలు మారాయి. ఆ తరువాత పవర్ స్టార్ ఏ సినిమా అంతగా రాబట్టలేదు. ఇక ఇప్పుడు అయితే పవన్ కంటే చిరంజీవే టాప్ లో ఉన్నాడు.


Tags:    

Similar News