పవన్ వాడే ఫోన్ ఏంటో తెలుసా!?

Update: 2017-02-07 10:38 GMT
గతంలో అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువగా పబ్లిక్ లో కనిపించేవాడే కాదు. ఇప్పుడు పొలిటికల్ గా కూడా యాక్టివ్ గా మారడంతో.. పలుమార్లు మీడియాలో దర్శనం ఇస్తున్నాడు. అయితే.. పవన్ ఎక్కడా ఎప్పుడూ చేతిలో ఫోన్ పట్టుకుని కనిపించిన సందర్భం ఉండదు. అలాగే పవర్ స్టార్ చేతిలో ఫోన్ ఉండగా తీసిన ఫోటోలు కూడా కనిపించవు.

మరి అసలు పవన్ కళ్యాణ్ సెల్ ఫోన్ నే ఉపయోగించడా ఏంటి అనుకోవచ్చు. అయితే.. పవన్ కు ఐఫోన్ పై ప్రత్యేకమైన ప్రేమ ఉందట. ఇందుకు కారణం.. ఉపయోగించడం సులభం అని అంతే తప్ప మరే ఇతర రీజన్ లేదట. ప్రస్తుతం ఐఫోన్ 6+ను ఉపయోగిస్తున్నాడట పవన్. దీన్ని తన భార్యతో పాటు ఆస్ట్రేలియా వెళ్లినపుడు అక్కడ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. బేసికల్ గా బుక్స్ అండ్ మ్యూజిక్ లవర్ అయిన పవన్ కళ్యాణ్.. ఐట్యూన్స్ ను కూడా విస్తృతంగా ఉపయోగిస్తాడనని అంటున్నారు. పాత ఇంగ్లీష్ ను విపరీతంగా పర్చేజ్ చేస్తాడట.

అలాగే బోలెడన్ని బుక్స్ పీడీఎఫ్ ల రూపంలో పవన్ ఐఫోన్ లో ఇమిడి ఉంటాయని అంటున్నారు. వీటితో పాటు పొలిటికల్ ట్వీట్స్ పెట్టేందుకు కూడా పవన్ ఫోన్ నే ఎక్కువగా ఉపయోగిస్తాడట. కుటుంబ సభ్యులకు తన చేతిరాతతో రాసిన సందేశాలను ఫోటోలు తీసేందుకు ఇష్టపడే పవన్.. అప్పుడప్పుడు మాత్రమే మెసేజ్ లను ఉపయోగిస్తాడట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News