బొకే విత్ లెటర్ ఓకే.. మేనల్లుడికి గారేంది పవనా?

Update: 2020-01-14 05:10 GMT
ఇల్లు ఏదైనా.. ఆ ఇంట్లో మేనమామ.. మేనల్లుడు లాంటి రిలేషన్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఏ మేనల్లుడికైనా.. ఏ మేనమామ అయినా ‘గారు’ సంబోధన ఉంటుందా? అలా పిలుస్తారా మీలో ఎవరైనా? అలాంటి పరిస్థితే అస్సలు ఉంటుందా? ఎందుకిదంతా అంటారా? తాజాగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంపిన అభినందనల లేఖలో గారు అన్న తోక కాస్త ఎబ్బెట్టుగా ఉందని చెప్పాలి.

డిసెంబరు 20న ప్రతిరోజూ పండగే అంటూ ప్రేక్షకుల్ని పలుకరించటం.. అందుకు ఆడియన్స్ ఇట్టే కనెక్ట్ కావటంతో సాయి ధరమ్ తేజ్ కు ఒక విజయాన్ని అందుకునేలా చేసింది. ఈ సినిమాపై ఇప్పటికే మెగాస్టార్ అభినందనలు అందుకున్న సాయిధరమ్ తేజ్.. తాజాగా పవర్ స్టార్ అభినందనల్ని సొంతం చేసుకున్నారు.

తాజాగా పూలబొకేతో పాటు.. ఒక అభినందనల లేఖను సాయిధరమ్ కు.. దర్శకుడు మారుతికి పంపారు పవన్ కల్యాణ్.  ఈ లేఖలో.. డియర్ సాయిధరమ్ తేజ్ గారికి.. ప్రతి రోజూ పండుగే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అభినందనలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అంటూ పేర్కొన్న దాన్లో దేన్ని వంక పెట్టాల్సిన అవసరం లేకున్నా.. మేనల్లుడి పేరు చివరన గారు పలుకరింపు ఒక్కటే అభ్యంతరమని చెప్పక తప్పదు.

పవన్ నుంచి పూలబొకే విత్ గ్రీటింగ్స్ రావటంతో సాయిధరమ్ తేజ్ కూడా ఉబ్బితబ్బుబ్బిపోతున్నారు. థ్యాంక్యూ పవన్ కల్యాణ్ సర్.. మీ అభినందనలతో సినిమా విజయం మరింత పరిపూర్ణమైంది. ఇదే అసలైన పండగ రోజు అంటూ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. అంతటి మేనమామే తనను గారు అని పేరు పక్కన తోక తగిలించినప్పుడు.. పవన్ మామ అంటూనే.. సర్ అన్న పదాన్ని మర్చిపోలేదు. మేనల్లుడిని మరీ ఇంత ఫార్మల్ గా పలుకరించాల్సిన అవసరం ఉందంటారా పవన్?


Tags:    

Similar News