ఫోటో స్టొరీ: పవన్ ఫ్యామిలీ చిరు ఇంట్లో!

Update: 2018-08-22 10:24 GMT
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అనే విషయం తెలిసిందే. నిన్నటి నుంచే మెగా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి.  చిరు పుట్టినరోజు కానుకగా 'సైరా' టీజర్ ను విడుదల చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులే లేవు.  మరో వైపు సోషల్ మీడియా లో మెగాస్టార్ కు పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ వెల్లువగా వచ్చిపడుతున్నాయి.  సాధారణ ఫ్యాన్సే కాకుండా సినిమా సెలబ్రిటీలందరూ చిరు కు విషెస్ తెలిపారు.

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్యా పిల్లలతో సహా అన్నయ్య ఇంటికి వెళ్లి ఒక అందమైన పూల బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.  భార్య అన్నా లెజ్నేవా తో పాటుగా కూతురు పోలెనా - బుల్లి తనయుడు మార్క్ శంకర్ వెంట ఉన్నారు.  ఇక ఈ ఫోటోలో బుల్లి మార్క్ శంకర్ ను అమ్మ ఎత్తుకోగా కెమెరా సూటిగా చూస్తూ ఉండడం  విశేషం. అంతేగా మరి..   మెగా స్టార్ - పవర్ స్టార్లిద్దరూ అక్కడే ఉన్నారుగా ఇక అలా వాళ్ళ యాక్టింగ్ వైఫై ఆటోమేటిక్ గా ఆన్ అయిందేమో.

బొకే ఇచ్చే సమయంలో చిరు ఆప్యాయంగా పవన్ మీద చేయి వేసిమరీ ఫోటో దిగితే పవన్ మాత్రం తనకై సొంతమైన స్టైల్ లో కాస్త సిగ్గు పడ్డట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు.  ఎంతైనా పెద్దన్నయ్య కదా ఆ మాత్రం ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది?  ఈ పిక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయితే. మెగా అభిమానులు ముచ్చట పడకుండా ఉండలేకపోతున్నారు.
Tags:    

Similar News