పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీమేక్ చిత్రాలే తనకు సౌకర్యంగా ఉంటాయని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ వ్యవహారాలు కూడా చూసుకోవాలి కాబట్టి.. రీమేక్ ప్రాజెక్ట్స్ అయితే వీలయినంత త్వరగా పూర్తవవుతాయని.. రిస్క్ ఫ్యాక్టర్ కూడా తక్కువ అని పవన్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోచించి ఉండొచ్చు.
'వకీల్ సాబ్' వంటి రీమేక్ చిత్రంతో సినిమాల్లోకి తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్.. బ్యాక్ టూ బ్యాక్ నాలుగు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసాడు. అయితే అందులో రీమేక్ మూవీ 'భీమ్లా నాయక్' నే ముందుగా కంప్లీట్ చేసాడు. ఇకపై రీమేక్ చిత్రాలు చేయొద్దని ఫ్యాన్స్ అభ్యర్థిస్తున్న టైంలో పవన్ అలాంటి చిత్రానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తమిళ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'వినోదయ సీతమ్' అనే చిత్రాన్ని తెలుగులో చేయడానికి పవన్ రెడీ అయ్యారు. ఇందులో మెగా మేనల్లుడు సాయి తేజ్ కూడా నటించనున్నారు. దీనికి ఎప్పటిలాగే త్రివిక్రమ్ మార్పులు చేర్పులు చేసే బాధ్యత తీసుకోగా.. మాతృకను డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
పవన్ అప్పుడెప్పుడో సెట్స్ మీదకు తీసుకొచ్చిన 'హరి హర వీరమల్లు' సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఇక 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ అనౌన్స్ చేసి రెండేళ్లయినా గడిచినా ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఇవి అసలు ఎప్పుడు పూర్తవుతాయో అని అందరూ ఆలోచిస్తుండగా.. తమిళ్ రీమేక్ కు ప్రాధాన్యత ఇచ్చారు పవర్ స్టార్.
రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ.. దర్శకుడు సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో సినిమాని ధ్రువీకరించారు. ఆగస్టులోనే ఈ చిత్రాన్ని మొదలు పెడతారని అన్నారు కానీ.. ఇప్పుడు కాస్త ఆలస్యం అవుతుందని రూమర్స్ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ రీమేక్ చిత్రానికి “జగత్ జజ్జరికా” అని టైటిల్ ను ఖరారు చేసారనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవర్ స్టార్ రేంజ్ కు రీమేక్ ప్రాజెక్ట్ సెట్ చేసావంటూ ఇప్పటికే అభిమానులు త్రివిక్రమ్ పై నెట్టింట ఫైర్ అవుతుండగా.. ఇప్పుడు అలాంటి అసంబద్ధమైన టైటిల్ పెట్టారంటూ మండిపడ్డారు.
అయితే గురువారం సాయంత్రం 'బింబిసార' సినిమా నుంచి వచ్చిన రిలీజ్ ట్రైలర్ లో కల్యాణ్ రామ్ నోటి నుంచి 'జగత్ జజ్జరికా' అనే డైలాగ్ వచ్చింది. దీంతో ఇది పవన్ సినిమా టైటిల్ కాదని.. నందమూరి హీరో చిత్రంలోని డైలాగ్ అని ఫ్యాన్స్ కాస్త ఉపశమనం పొందారు. అయినప్పటికీ ఇదే టైటిల్ ను పవన్ కళ్యాణ్ సినిమాకు పెట్టే అవకాశం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.