డ్రగ్స్ .. కాస్టింగ్ కౌచ్ గురించి అన్ని పరిశ్రమల్లో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. సుశాంత్ సింగ్ బలవన్మరణం అనంతరం రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. రియా చక్రవర్తి అరెస్టుతో డ్రగ్స్ లింకు దొరికింది. అటు శాండల్వుడ్ లోనూ డ్రగ్స్ కలకలం తెలిసినదే.
ఇకపోతే డ్రగ్స్ గురించి కాస్టింగ్ కౌచ్ గురించి అందాల కథానాయిక పాయల్ ఘోష్ ఉన్నట్టుండి సడెన్ బాంబ్ పేల్చింది. తనకు డ్రగ్స్ పుచ్చుకునే హీరోలు తెలుసని.. కానీ వాళ్లంతా చాలా జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పిన ఈ అమ్మడు తనను ఒక డైరెక్టర్ తీవ్రంగా వేధించాడని.. నీలి చిత్రాల్ని చూపించే ప్రయత్నం చేశాడని వెల్లడించి షాకిచ్చింది.
అందరు హీరోలు డ్రగ్స్ తీసుకుంటారని చెప్పను. వారిలో కొందరు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ చాలా మంది నటులు డ్రగ్స్ తీసుకునేవారేనని కచ్చితంగా తెలుసు. వారు కొంతకాలం తర్వాత వాటిని విడిచిపెట్టవచ్చు. ఆరోగ్య సమస్యలు వచ్చినా జాగ్రత్తలు తీసుకోవచ్చని వారు అనుకుంటారు. కానీ అదెలా సాధ్యం? హీరోలు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు సమాజానికి రోల్ మోడల్ లేదా స్ఫూర్తిగా ఉండాలి అని పాయల్ అంది. ఇక ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ చాలా కాలం నుండి స్నేహితుడు అని ఆమె పేర్కొంది. వారు కలిసి వర్కౌట్స్ చేసేవారట.
సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య చేసుకునే బలహీనమైన మనస్సు కాదని ఆమె పేర్కొన్నారు. అతని మరణం హత్య కావచ్చని పరోక్షంగా ఆమె ఒక సందేహాన్ని వ్యక్తం చేసింది. అలాగే తాను కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నానని తెలిపిన పాయల్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్.టీ.ఆర్ ఒక పరిపూర్ణ జెంటిల్‌మన్ అని ధృవీకరించారు. అయితే ఒక దర్శకుడి వల్ల తాను బాలీవుడ్‌లో చాలా కఠినమైన సమయాన్ని అనుభవించాల్సి వచ్చిందని తెలిపారు. తనను ఓసారి గదిలో కూర్చోబెట్టి అకస్మాత్తుగా అతను నాకు బ్లూ ఫిల్మ్ చూపించడం ప్రారంభించాడని ఒక దర్శకుడిపై ఆరోపించింది. అతడు ఈరోడ్ ముంబైలో ఉంటాడట. అయితే తాను అక్కడి నుంచి బయటపడ్డానని తెలిపింది. అప్పుడు అతను నాకు చాలా మంది హీరోయిన్లు తెలుసునని వారిని పిలిచినప్పుడల్లా వద్దకు వచ్చి సమయం గడుపుతారని చెప్పాడట. ఆ సంఘటన తరువాత నేను అతనిని కలవడం మానేశానని వెల్లడించింది.