ఈమద్య కాలంలో స్టార్స్ అంతా కూడా డిప్రెషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సుశాంత్ రాజ్ పూత్ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తాము కూడా ఆత్మహత్య చేసుకోవాలి అనిపించేంత డిప్రెషన్ లోకి గతంలో వెళ్లి పోయామంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అందులో ఒక హీరోయిన్ పాయల్ ఘోష్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పాయల్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యింది. ఆ సందర్బంగా పలు విషయాలను వెళ్లడి చేసింది.
సినిమాలంటే తనకు పిచ్చి అని.. ఆ పిచ్చితో పాత్ర డిమాండ్ చేస్తే గుండుతో కూడా నటించేందుకు సిద్దం అంటూ చెప్పుకొచ్చింది. పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి సాహసమైన చేస్తానంది. ఇక మంచు హీరో మనోజ్ తో సినిమా చేస్తున్న సమయంలో చాలా ఎంజాయ్ చేశాను అని.. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన హీరో అంది. తమిళ స్టార్ సూర్య అంటే అభిమానం అన్న పాయల్ ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ అభిమాని ప్రశ్నించగా బాహుబలి అంటూ సమాధానం ఇచ్చింది.
ఒక నెటిజన్ మీకు దేవుడు వరం ఇస్తే వెంటనే ఏం కోరుకుంటారు అంటూ ప్రశ్నించగా.. పాయల్ స్పందిస్తూ నాకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ అంటే అమితమైన అభిమానం. ఆయనతో ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. రొమాంటిక్ సీన్ లో ఆయనతో ఒక్కసారి అయినా నటించే ఛాన్స్ రావాలని ఆశిస్తున్నాను అంటూ పాయల్ నిర్మొహమాటంగా చెప్పేసింది.