ఆర్ ఎక్స్ 100 అన్నంతనే బోల్డుగా అందాలు ఆరబోసిన పాయల్ చటుక్కున గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆమె అందాల ప్రదర్శన థియేటర్ ను వేడెక్కించేసిన సంగతి తెలిసిందే. తెర మీద ముద్దులు పెట్టుకున్నంత మాత్రాన.. ఇండస్ట్రీలో అందరిని ముద్దులు పెట్టుకోవటానికి రాలేదన్న బోల్డ్ వ్యాఖ్యతో పాటు మరోసంచలన నిజాన్ని బయటపెట్టిందీ పంజాబీ అమ్మాయి.
ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె.. తనకు నాలుగు రోజుల క్రితమే ఆఫర్ వచ్చిందని.. కాంప్రమైజ్ అయితే.. మంచి ఛాన్స్ అన్నారన్న బాంబు పేల్చింది. అయితే.. తాను ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు వెల్లడించింది. తనకు ఎదురైన అనుభవాన్ని తప్పనిసరిగా పబ్లిష్ చేయాలని మరి చెప్పిన పాయల్ మాటలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాను టాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చానని.. అవకాశాల కోసం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని కుండ బద్ధలు కొట్టారు. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న ఆమె.. తొలిసినిమాలో అందాల ఆరబోసింది కాబట్టి.. ఏమైనా ఓకే అనుకుంటే తప్పేనని.. తాను పక్కా ప్రొఫెషనల్ గా చెప్పింది.
తొలిసినిమాలో చేసిన పాత్రను చూసి ఏదో అనుకుంటున్నారేమో కానీ.. తాను టాలెంట్ తో ఇంత దూరం వచ్చానే తప్పించి కాంప్రమైజ్ అయి రాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదంటూ తన దగ్గరకు ఎలాంటి ప్రపోజల్ తీసుకురావాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది.
ఒక హిట్ మూవీలో నటించిన ఒక నటి ఇంత ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇవ్వటం.. నాలుగు రోజుల క్రితమే తనను కాంప్రమైజ్ కావాలంటూ ఆఫర్ ఇచ్చారని ప్రకటించటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి తన మాటలతో చెత్త ప్రపోజల్స్ తెచ్చే వారికి పాయల్ తెలివిగా చెక్ చెప్పిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.