తూర‌లో ఆ కునుకుపాట్లేమిటో పాయ‌ల్..!

Update: 2021-04-15 09:30 GMT
ఇటీవ‌ల ఫోటోషూట్ల తీరు తెన్నులు మారాయి. ఇప్పుడంతా కాన్సెప్ట్ ఫోటోషూట్ ట్రెండ్. వీడియో షూట్ల‌కు అదే వ‌ర్తిస్తుంది. ఇటీవ‌ల‌ ఫోటోషూట్ల కోసం ఇక్క‌డ అక్క‌డ అని లేదు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ‌.. హ‌రోయిన్లు ఫోటోషూట్ కోసం రెడీ అయిపోతున్నారు. అయితే అందులో క్రియేటివిటీ క‌నిపించాలి అంతే. ఇంత‌కుముందులా ఊటీ కో కొడైకెనాల్ కో వెళ్లి ప‌చ్చ‌ని లోకంలో ఫోటోషూట్లు అక్క‌ర్లేదు.

ముఖ్యంగా నేచుర‌ల్ స్టూడియోస్ ఎక్క‌డిక‌క్క‌డ అందుబాటులోకి వ‌స్తున్నాయి. యాంటిక్ ఫోటోషూట్స్.. వింటేజ్ ఫోటోషూట్స్ అంటూ చాలా హంగామా సృష్టిస్తున్నారు. ముంబైలో ఇలాంటివి ఎక్కువ‌. కానీ ఇప్పుడు హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ఇలాంటివి ఉన్నాయి. ప్ర‌త్యేకించి యాంటిక్ ఐటెమ్స్ తో స్టూడియోలు క‌నిపిస్తున్నాయి. 5-10 ఎక‌రాల మేర కేటాయించి వీటిలో ర‌క‌ర‌కాల  మినీ యాంటిక్ స్టూడియోలు.. ప్రాప‌ర్టీస్ ని సెట్ చేసి ర‌క‌ర‌కాల ఫోటోషూట్ల కోసం ఛాన్స్ క‌ల్పిస్తున్నాయి. ఇదో పెద్ద బిజినెస్ ట్రెండ్ న‌డుస్తోంది.

ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ ఫోటోషూట్ల కోసం సెల్రిటీలు ఈ స్టూడియోల మీద ప‌డుతుండ‌డంతో డిమాండ్ ఊపందుకుంద‌ట‌. ఇక‌పోతే  హాట్ గాళ్ పాయ‌ల్ రాజ్ పుత్ ఇక్క‌డ ఏం చేస్తోందో చూశారు క‌దా!

పాయ‌ల్ ఎక్క‌డో మూములుగా ఇండ్ల నిర్మాణం జ‌రుగుతున్న చోట ఇలా తూర‌లో ప‌డుకుని ఫోజులిచ్చింది. బ‌హుశా హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్స్ లోనే ఈ ఫోటోషూట్. ఔట‌ర్ లో ఇలాంటివి ఎన్నో నేచుర‌ల్ గా అందుబాటులో ఉన్నాయి.

ఇటీవ‌ల క‌థానాయిక‌లు ఖాళీగా బిల్డింగులు వైర్లు తీగ‌లు చెద బ‌ట్టిన కార్లు క‌నిపిస్తే చాలు అక్క‌డ ఫోటోషూట్ల‌కు రెడీ అయిపోతున్నారు. బాగా పాడుబ‌డిన బంగ్లాలు బూత్ బంగ్లాలు దొరికినా పాత డెన్ లు కార్ షెడ్లూ దొరికినా ఫోటోషూట్ల కోసం వ‌దిలి పెట్ట‌డం లేదు. వీటినే ఫోటోషూట్ లొకేష‌న్లుగా మినీ స్టూడియోలుగా మార్చేసి షూట్ కి ఇంత అని డ‌బ్బు వ‌సూలు చేసేస్తున్నారు. గంట‌కు రోజుకు ఇంత‌ని చెల్లించేందుకు సెల‌బ్రిటీలు రెడీ అయిపోతున్నారు. ఇక బాలీవుడ్ లో ఇలాంటి ఫోటోషూట్ల‌కు మ‌రింత ప్రాధాన్య‌త ఉంది. నిజానికి సౌత్ లోకి అదే క‌ల్చ‌ర్ దిగుమ‌తి అయ్యింద‌ని చెప్పాలి. పాయ‌ల్ అలా తూర‌లో కునుకేస్తూ ఇచ్చిన ఫోజులు ప్ర‌స్తుతం యువ‌త‌రంలో వైర‌ల్ గా మారాయి.
Tags:    

Similar News