ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. చాలామంది జీవితాల్ని మార్చేస్తోంది. పది రోజుల కిందట చిన్న సినిమాగా విడుదలైన పెద్ద రేంజికి వెళ్తున్న ‘పెళ్లిచూపులు’ ఆ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి జీవితాల్నీ మార్చేస్తోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆల్రెడీ సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్లో.. విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం పట్టేశాడు. అతడి కోసం మరింతమంది హీరోలు లైన్లో ఉన్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు. అతను ప్రస్తుతం చేస్తున్న ద్వారక.. అర్జున్ రెడ్డి సినిమాలకు మంచి క్రేజ్ వచ్చింది. వాటి బడ్జెట్లు కూడా పెంచుకునే అవకాశం దక్కింది. బిజినెస్ కూడా బాగా జరిగే అవకాశముంది. వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద బేనర్లో హీరోగా చేసే అవకాశం కూడా అందుకున్నాడు. ఇంకో రెండు మూడు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.
ఇక ఇన్నాళ్లూ చిన్నా చితకా పాత్రలతో నెట్టుకొస్తున్న హీరోయిన్ రీతూ వర్మ ‘పెళ్లిచూపులు’ తన టాలెంట్ చూపించి అడివి శేష్ కొత్త సినిమాలో అవకాశం అందుకుంది. ఇంకా ఆమెకు రెండు మూడు సినిమాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో కమెడియన్ గా అదరగొట్టిన ప్రియదర్శి ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించుకున్నాడు. అతడి కోసం చాలా మంది లైన్లో ఉన్నారు. కొన్ని రోజుల్లోనే అతను ఫుల్ బిజీ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరో ఫ్రెండుగా నటించిన ఇంకో కుర్రాడు.. హీరో తండ్రి పాత్రలో నటించిన కేదార్.. అనీష్ కురువిల్లా.. గురురాజ్ మానేపల్లి లాంటి వాళ్లు కూడా బిజీ అయ్యేలా కనిపిస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు వివేక్ సాగర్.. సినిమాటోగ్రాఫర్ నగేష్ బానెల్ కూడా న్యూవేవ్ సినిమాలకు తామిద్దరం మంచి ఛాయిస్ అని రుజువు చేసుకున్నారు. ఇక ఇన్నాళ్లూ ఏవో అల్లాటప్పా సినిమాలు చేసుకుంటూ వచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి కూడా ‘పెళ్లిచూపులు’తో ఫేమస్ అయిపోయాడు. మంచి గుర్తింపు.. ఆదాయం అందుకున్న రాజ్.. మున్ముందు ఇంకొంచెం పెద్ద రేంజిలో సినిమాలు చేయాలనుకుంటున్నాడు. మొత్తానికి ‘పెళ్లిచూపులు’ సినిమా చాలామంది ఫేట్ మార్చేసిందనే చెప్పాలి.