26/ 11 ముంబై ఎటాక్స్ పై సినిమా తీశాడు ఆర్జీవీ. సంచలనాల వర్మ తలచుకుంటే ఎలా ఉంటుందో ప్రాక్టికల్ గా చూపించాడు ఈ సినిమా తో. కుర్చీ అంచుమీద కూచుని చూసేంత ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు అందుకు ధీటైన సినిమా వస్తోంది. బ్యాక్‌డ్రాప్ అదే. అయితే కథాంశంలో మార్పు ఉంది.
ముంబై ఎటాక్స్ టైమ్ లో జరిగిన ఓ చిన్న ఇన్సిడెంట్ ఆధారంగా అల్లుకున్న ఓ కొత్త కథ ఆధారంగా బాలీవుడ్ లో ఫాంటమ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. సైఫ్ అలీఖాన్, కత్రిన కైప్ కథానాయికలు. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. రేపు టీజర్ రిలీజవుతోంది. అయితే టీజర్ కంటే ముందే పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ లో నాయకానాయికల కళ్లను మూసేశారు. భారతీయ జెండాతో చుట్టేశారు. అంతేనా ఓ బాంబ్ బ్లాస్ట్ జరిగి.. అందులో గాయపడితే ఎలా ఉంటారో అలా ఇద్దరికీ మేకప్ వేసి చూపించారు. పెదవులు రక్తంతో తడిసిపోయాయి. శరీరమంతా దుమ్ముకణాలతో దుర్భేద్యం అయిపోయింది. అయితే ఈ ఇద్దరి కథ ఏమిటన్నది ఆసక్తికరం.
ముంబై తాజ్ హోటల్ పై పాక్ తీవ్రవాదులు చేసిన దాడి ఎప్పటికీ హాట్ టాపిక్. కాబట్టి ఈ సినిమాకి ఇప్పటికే హైప్ పెరిగింది. రేపటి టీజర్ లో అసలు విషయం అర్థమైపోతుంది. అంతవరకూ వెయిట్ అండ్ సీ.