ఫ్యాషన్ ప్రపంచపు పోకడల్ని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని పరిచయం చేయడంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తర్వాతే ఎవరైనా. తెరపై కనిపించే ఎనర్జీ ఒకెత్తు అనుకుంటే తెరవెనక అతడి వైబ్రేంట్ ఫ్యాషన్స్ అనుకరణ ప్రత్యేకంగా చర్చకు వస్తుంటుంది. బోల్డ్ లుక్ తో అవేగా కనిపిస్తూ బోలెడంత సందడి చేస్తాడు. ఒక రకంగా బాలీవుడ్ పూలరంగడిగానూ అతడికి గుర్తింపు ఉంది.
ముఖ్యంగా రణవీర్ సింగ్ హిజ్రా తరహా గెటప్పులకు బోలెడంత క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఆడా కాని మగా కాని ఒక ప్రత్యేకమైన రూపంతో ప్రత్యక్షమై చాలాసార్లు అతడు అభిమానులను షాక్ కి గురి చేశాడు. ఇప్పుడు కూడా మరోసారి సేమ్ టు సేమ్ రిపీట్ చేశాడు. అయితే ఈసారి అంతకుమించి అన్న రేంజులో చెలరేగాడు.
రణవీర్ సింగ్ కొత్త లుక్ ఇలా రివీల్ కాగానే ట్విట్టర్ మీమ్స్ తో షేకైంది. రణవీర్ సింగ్ తన గూచీ-స్పెషల్ లుక్ వరుస ఫోటోలు ఇంటర్నెట్ ని అల్లాడించాయి. టాప్ టు బాటమ్ గూచీ పీసెస్ తో స్పెషల్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోల్లో పొడవాటి జుట్టు భుజాల మీదుగా కనిపిస్తోంది. బ్లూ కలర్ ట్రాక్ సూట్ చాలా లూజ్ ఫ్యాషన్ కి తగ్గట్టు మెడ నుంచి డిజైన్ చేసినట్టుగా ఆ భారీ ఆభరణం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. ఈ క్రియేటివిటీ ఎవరిది అంటే.. గూచీ క్రియేటివ్ డైరెక్టర్ అలెశాండ్రో మిచెల్ కు అంకితం చేసాడట. ఆ చేతిలో బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ చూశాక లింగ నిర్ధారణ చేయాలి మరి. గూచీ స్టైల్ లో 1961 నాటి హ్యాండ్ బ్యాగ్ స్టైల్ ని అనుకురించారట.
రణ్ వీర్ సింగ్ విచిత్రమైన రూపం ట్విట్టర్ లో మీమ్ ఫెస్ట్ కు తెరలేపింది. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ... అద్దంలో రణ్‌వీర్ ప్రతిబింబం కొంతవరకు దీపిక లాగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రణవీర్ 21 వ శతాబ్దపు అలావుద్దీన్ ఖిల్జీ వెర్షన్ ను గుర్తు చేశాడని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే జీసస్ కి మోడ్రన్ వెర్షన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఓరి నీ సింగారం పాడు కానూ.. అంటూ ఒక సెక్షన్ మైమరిచిపోతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. రణవీర్ నటించిన 83 రిలీజ్ కావాల్సి ఉంది.